twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పివిపి సినిమాలో హాట్ బ్యూటీ అదా శర్మ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ తొలి చిత్రంతోనే అందం పరంగా, టాలెంట్ పరంగా మంచిమార్కులు కొట్టేసింది. ఒకే ఒక్క సినిమాతో ఆమెకు ఇంత గుర్తింపు వచ్చిందంటే కేవలం ఆమె అందం, అభినయమే. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

    ఆ మధ్య సైమా అవార్డుల కార్యక్రమంలో ఆదా శర్మ పెర్ఫార్మెన్స్ చూసి అంతా ముగ్దులయ్యారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది అదా శర్మ. ఈ క్రమంలోనే ఆమె నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి దృష్టిలో పడింది. దీంతో ఆమెకు తన తర్వాతి సినిమాలో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    ప్రస్తుతం అదా శర్మ తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన, ఆది హీరోగా తెరకెక్కుతున్న గరం సినిమాలో, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రణ విక్రమలో, మంచు మనోజ్ తర్వాతి సినిమాలో నటిస్తోంది.

    Adah sharma

    English summary
    Movie giant PVP who watched the rushes of Trivikram film has decided to sign Adah Sharma for a female centric movie. A source close to PVP says, He was planning to rope in an established actress for this role as it is a very complex character but signed new face Adah as he sees potential in her.He was impressed with her performance in the Hindi movie 1920 also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X