పివిపి థియేటర్లో సచిన్, అనుష్క సందడి (ఫోటోస్)

By Bojja Kumar

విజయవాడ: ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరికి చెందిన మల్టీప్లెక్స్ థియేటర్ 'పివిపి స్క్వేర్' ప్రారంభోత్సవం విజయవాడలో ఈ రోజు ఉదయం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచిన్ చేతుల మీదుగా థియేటర్ ప్రారంభోత్సవం జరిగింది. సచిన్‌తో పాటు హీరోయిన్ అనుష్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచిన్ టెండూల్కర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానుల కోలాహలంతో పివిపి స్క్వేర్ ప్రాంగణం సందడిగా మారింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఈ థియేటర్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్, అనుష్క, రాఘవేంద్రరావు తదితరులు పివిపి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఓపెనింగు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

ప్రసాద్ వి పొట్లూరి విజయవాడలో ‘పివిపి స్వ్కేర్' పేరుతో ఓ కాంప్లెక్స్ నిర్మించారు. సచిన్ చేతుల మీదుగా ప్రారంభించారు.

పివిపి స్వ్కేర్

పివిపి స్వ్కేర్

ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న మాల్స్ -కాంప్లెక్స్ లను తలదన్నేలా అత్యాధునిక సౌకర్యాలతో నవతరం సొగబులతో పాటు సాంప్రదాబద్దమైన వ్యవస్థీకరణతో రూపుదిద్దుకుంది ‘పివిపి స్వేర్'.

ప్రత్యేక ఆకర్షణ

ప్రత్యేక ఆకర్షణ

కొత్తగా ఏర్పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు పివిపి స్వ్కేర్ ఓ రాజమకుటంలా ఉండబోతోందని, త్వరలోనే ఇండస్ట్రియల్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందనున్న విజయవాడకు పివిపి స్వ్కేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పి.వి.పి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రసాద్ వి పొట్లూరి

ప్రసాద్ వి పొట్లూరి

తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా మారిన పి.వి.పి సంస్థ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి..నిర్మాతగానే కాకుండా వ్యాపార వేత్తగానూ తన దక్షతను ఘనంగా చాటుకుంటూ ఆ రంగంలోనూ విజయబావుటా ఎగురవేస్తున్నారు.

సచిన్ తో...

సచిన్ తో...

క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన ప్రసాద్ వి.పొట్లూరి ‘ఐబిఎల్-ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్'లో ప్రాంచైజీ ఓనర్‌గా ఉన్నారు. ఆయన ఫ్రాంచైజీ ఓనర్‌గా ఉన్న ‘హైదరాబాద్ హాట్ షాట్స్' జట్టు సైనా నెహ్వాల్ నేతృత్వంలో 2013 ఐబిఎల్ ట్రోపీ గెలుచుకుంది. అలాగే దీంతో పాటు పివిపి ‘ది గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ తో కలిసి ఇండియన్ సాకర్ లీగ్ లోకి అడుగిడిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X