PVR Cinemas: ఓటీటీపై సినిమాలు.. దయచేసి అలా చేయకండి...!

కరోనా వైరస్ సినీ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా.. సినిమా థియేటర్స్, షూటింగ్స్ అన్ని మూలనపడ్డాయి. థియేటర్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో.. సినిమా షూటింగ్స్ తిరిగి ఎప్పుడు మొదలువుతాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ క్రమంలో కొంతమంది చిన్న నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రముఖ సంస్థ పీవీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Recommended Video

Movies Releasing On OTT platforms, PVR Cinemas Oppose
 ఓటీటీపై రిలీజ్‌కు రెడీ..

ఓటీటీపై రిలీజ్‌కు రెడీ..


చిన్న నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ కాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ భారాన్ని తగ్గించుకునేందుకు సినిమాలను ఓటీటీపై రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా కొన్ని సినిమాలు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో దర్శనమివ్వబోతోన్నాయి.

 పీవీఆర్ ప్రకటన..

పీవీఆర్ ప్రకటన..

ఓటీటీపై సినిమాలను రిలీజ్ చేయడంపై స్పందిస్తూ.. ‘ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగించాలంటే అది కేవలం థియేటర్స్‌లో మాత్రమే సాధ్యం అవుతుంది. కోవిడ్ 19 వల్ల థియేటర్స్ మూత పడ్డాయి. ఈ పరిస్థితి త్వరలోనే సమసిపోతుంది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి.

వారి నిర్ణయాల పట్ల అసంతృప్తి...

వారి నిర్ణయాల పట్ల అసంతృప్తి...

కొందరు నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వారు మా నిర్ణయాన్ని గౌరవించి ఓటీటీలో రిలీజ్ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సినిమా ఎగ్జిబిటర్స్‌కు ఇలాంటి సవాళ్లన్నీ సర్వ సాధారణమే. గత కొన్నేళ్లుగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నాం.

అందరికీ ధన్యవాదాలు..

అందరికీ ధన్యవాదాలు..


కొందరు నిర్మాతలు మాత్రం తమ సినిమా విడుదలను వాయిదా వేశారు. మళ్లీ థియేటర్స్‌ ఓపెన్ అయిన తరువాతే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాంటి వారికి ధన్యవాదాలు. థియేటర్స్‌కు సపోర్ట్ చేస్తున్నవారందరకీ ధన్యవాదాల'ని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X