Movies సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో రూ.699కే 10 సినిమాలు
మీరు సినిమా లవర్సా... ప్రతి నెల మీరు సినిమాలు చూసేందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారా... ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటే.. మీరు ఇక ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ రూ.699లకే 10 సినిమాలు చూడొచ్చు. అది కూడా మల్టీప్లేక్స్ థియేటర్లలో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడొచ్చు. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు మెల్లిమెల్లిగా థియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న పీవీఆర్.. ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ను మూవీ లవర్స్ కోసం పట్టుకువచ్చింది.
Recommended Video


ప్రస్తుత కాలంలో మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలంటే... వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఒక్క వ్యక్తి సినిమాకు వెళ్లినా రూ.1000 వరకు ఖర్చు పెట్టాలి. అదే ఫ్యామిలీతో వెళ్తే... వేలల్లో ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేలా చేయడానికి పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్ ను తీసుకువచ్చింది.
కేవలం రూ.699లకే 10 సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తీసుకున్న వారు.. నెలలోపు 10 సినిమాలు చూడవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలు చూసేందుకు కాస్త కండిషన్స్ కూడా అప్లే ఉన్నాయి. పీవీఆర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా.. 30 రోజులకు రూ.699 చెల్లించి ఏదైనా PVR థియేటర్‌లో 10 సినిమాలను వీక్షించవచ్చు.

అయితే ఈ ఆఫర్ విక్ డేస్‌లో (సోమవారం నుండి శుక్రవారం) మాత్రమే వర్తించనుంది. ఇక హైదరాబాద్‌లోని సినీ ప్రేక్షకులు తమ అభిమాన సినిమాలను పెద్ద స్క్రీన్‌లపై చూసేందుకు ఇది ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. ముఖ్యంగా నూతన సంవత్సరం, సంక్రాంతికి రాబోయే మోస్ట్-వెయిటింగ్ సినిమాలను ఈ పాస్ ద్వారా చూసి ఎంజాయ్ చెయొచ్చు.
ఇక సంక్రాంతికి మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, తేజ సజ్జా ప్రశాంత్ వర్మ హనుమాన్, రవితేజ నటించిన ఈగల్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పీవీఆర్ సబ్ స్క్రిప్షన్ మీద మరి ఈ సినిమాలన్నీటిని తక్కువ ధరకే ఫ్యామిలీతో కలిసి చూసేయండి.


Click it and Unblock the Notifications











