బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ పిక్స్.. సీక్రెట్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ టాటూ.. అందుకే ఇంతలా!
నేటితరం హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫాలోయింగే వేరు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన ఫాలోయింగ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు సరికదా మరికాస్త మించిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి వెండితెరపై కనిపించనుండటం ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే పవన్‌పై తనకున్న అభిమానానికి ప్రతీకగా ఏకంగా తన సీక్రెట్ ప్లేస్‌లో పవన్ పేరును రాసుకుంది బిగ్ బాస్ బ్యూటీ. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ వివరాలేంటి? చూద్దామా..

పవన్ అంటే పిచ్చి.. సినీ తారల్లో కొందరు
అభిమానుల సంగతి అటుంచితే సినీ తారల్లోనే కొందరు పవన్‌ని, ఆయన వెళ్లే తీరుని తెగ అభిమానిస్తుంటారు. అలాగే ఆయనను పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతుంటారు. అందులో ముఖ్యంగా బండ్ల గణేష్, నితిన్ లాంటి వాళ్ళ పేర్లను చెప్పుకోవచ్చు.

బిగ్ బాస్ బ్యూటీ సీక్రెట్ ప్లేస్‌లో పవన్..
ఇకపోతే జూనియర్ సమంతగా పేరొందిన అషురెడ్డికి కూడా పవన్ అంటే వీరాభిమానం. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించిన ఈమె పవన్ పై ఉన్న ప్రేమను పచ్చుబొట్టు రూపంలో చూపిస్తోంది. ఏకంగా తన సీక్రెట్ ప్లేస్‌లో ఆయన పేరును వేసుకొని షాకిచ్చింది అషు రెడ్డి.

పవన్ అంటే ప్రాణం.. అందుకే ఇంతలా
అషు రెడ్డి.. తనకు పవన్ అంటే ప్రాణం అని అందుకే పచ్చబొట్టు కూడా వేయించుకున్నానని చెబుతోంది అషు. ఓ హీరోపై ఇంతటి అభిమానం కురిపించడమంటే మామూలు విషయం కాదు. ఈమెనే కాదు ఇంకా చాలా మంది హీరోయిన్లు తమకు పవన్ అంటే ప్రాణం అని చెబుతుండటం చూస్తూనే ఉన్నాం.

జూనియర్ సమంత హడావిడి
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అషు రెడ్డి. అచ్చం సమంత లాగే ఉంటుందని ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటారు జనం.
ఇక ఈ మధ్యే బిగ్ బాస్ షోతో బయట కూడా బాగానే హడావిడి చేసిన ఈ ముగ్గుగుమ్మ పవన్ జపం చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

యాంకర్ సుమ ప్రశ్న.. అషు రెడ్డి షాకింగ్ ఆన్సర్
అంతేకాదు తాజగా సుమ క్యాష్ షోకు వచ్చిన అషు రెడ్డి.. సుమ వేసిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది. పవన్ పచ్చబొట్టు తీయించుకుంటావా? లేదంటే పవన్ సినిమాలో ఆఫర్ వస్తే వదిలేస్తావా? అని సుమ అడగగానే.. మరో ఆలోచన లేకుండా సినిమా వదిలేసుకుంటానని చెప్పేసింది అశు. పవన్ అంటే ఎందుకు అంత పిచ్చి అంటే తెలియదు కానీ.. నేను ఆయన అభిమానిని కాదు భక్తురాలుని అని చెప్పింది అశు రెడ్డి.

కెమెరా ముందు పవన్.. లేటెస్ట్ అప్‌డేట్
మరోవైపు రాజకీయాలకు కాస్త విరామం ఇస్తూ తిరిగి కెమెరా ముందు చేరారు పవన్ కళ్యాణ్. ఓ వైపు పింక్ రీమేక్ మూవీలో నటిస్తూనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి కూడా వచ్చేశారు. దీంతో పాటు ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ చేశారు.


Click it and Unblock the Notifications











