‘ప్యార్ మే పడి పోయానే’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు చిత్రాల తర్వాత యంగ్ హీరో ఆది నటిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ...ఆది పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం ఆది కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుంది. మా బేనర్లో వస్తున్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఈ చిత్రం. అనూపర్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది' అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ వివ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహా, పృథ్వీ, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా జనక్, మాధవి సిద్ధం, విష్ణు ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ : టి.మణిశ్రీ, కెమెరా: టి.సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.రవికుమార్, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వం: రవి చావలి.


Click it and Unblock the Notifications











