Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఒక రేంజ్లో బిగ్ బాస్ జంట రొమాన్స్ .. రివ్యూలు అదుర్స్!
ఎలాంటి వ్యక్తినైనా తక్కువ సమయంలో సెలేబ్రిటిగా మార్చేయగల సత్తా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉంది. బిగ్ బాస్ షోతో స్టార్ సెలెబ్రిటీలుగా చాలా మంది మారిపోయారు. గత ఏడాది తమిళ బిగ్ బాస్ తో క్రేజ్ సంపాదించుకున్న హాట్ మోడల్ రజియా విల్సన్, నటుడు హరీష్ కళ్యాణ్ క్రేజీ సెలెబ్రిటీలుగా మారిపోయారు. వీరిద్దరూ కలసి జంటగా నటించడం కూడా హాట్ టాపిక్. రజియా, హరీష్ నటించిన ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రివ్యూలు అదుర్స్
తమిళంలో రూపొందిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రివ్యూలు వస్తున్నాయి. మంచి రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం అని ప్రశంసిస్తున్నారు.
రొమాన్స్ పండించారు
రజియా, హరీష్ మధ్య ఈ చిత్రంలో రొమాన్స్ బాగా పండింది. దర్శకుడు ఎలాన్ కామెడీ, ప్రేమ సన్నివేశాల్ని బ్యాలన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని నడిపించారు. హరీష్ ఈ చిత్రంలో కార్పొరేట్ ఉద్యోగిగా నటించాడు. రజియా ప్రేమ మీద నమ్మకం లేని మోడ్రన్ యువతిగా నటించింది.
బిగ్ బాస్ మహిమ
ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం ప్రారంభం అయినప్పటికీ నుంచే ఈ చిత్రం కోసం యువత ఆసక్తిగా ఎదురుచూశారు. బిగ్ బాస్ క్రేజ్ ఈ చిత్రంపై బాగా పనిచేసింది. యువతని ఆకర్షించే అన్ని అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఆరంభం నుంచే
ఆరంభం నుంచే రొమాంటిక్ స్టిల్స్ తో చిత్రానికి బాగా ప్రచారం చేశారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రాన్ని సంగీతం అందించాడు. యువన్ ఈ చిత్రానికి ఒక నిర్మాత కూడా. కమల్ నటించిన విశ్వరూపం 2 పోటీని తట్టుకుని కూడా ఈ చిత్రం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.