'మర్మయోగి' కథా మర్మం

By Staff

Kamal Hassan
కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న 'మర్మయోగి' చిత్రం ఇప్పుడు ట్రేడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ సినిమా కథపై చాలా మందికి కుతూహలం ఉండే ఉంటుంది. అయితే విశ్వసనీయంగా తెల్సిన సంగతి ప్రకారం ఈ సినిమా 1866 లో మేరీ కరోలీ వ్రాసిన 'వెన్ డెత్తా' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందన్న సంగతి తెలుస్తోంది. ఆ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో హీరో ఓ సమాధినుండి బయిట పడటంతో ప్రారంభమవుతుంది. అతను చనిపోయాడనుకుని అతని భార్య ,ప్రాణ స్నేహితుడు కలసి పాతిపెట్టేస్తారు.

అయితే అతను బ్రతికే ఉండి ఆ సమాధిని పగలకొట్టుకుని బయిటకు వచ్చి ఇంటికి వెళ్తాడు.అప్పటికే ఆ టెన్షన్ కి అతని జుట్టు తెల్లరంగకు మారి భౌతికంగా మార్పులు వచ్చేస్తాయి. దాంతో ఎవరూ అతన్ని ఆ రాత్రి వేళ గుర్తు పట్టరు .అప్పుడు అతను తన ఇంటి వెనుక నుండి గోడ దూకి లోపలకి వెళ్తాడు.అప్పుడు అక్కడు అతని మిత్రుడు,భార్య కలసి రమిస్తూంటారు. తన ముద్దుల కూతరు ప్రక్కన ఏడుస్తూంటుంది.అది చూసిన హీరో తిరిగి వెనక్కి వెళ్ళి మారు వేషంలో కొంత కాలం అనంతరం తిరిగి వచ్చి భార్య,మిత్రుడు లపై పగ తీర్చుకుంటాడు.

ఇక 1.25 బిలియన్ బడ్జెట్ తో తయారవనున్న ఈ మర్మయోగి సినిమాను రజనీకాంత్ కూతురు సౌందర్య టేకప్ చెయ్యబోతోందనే వార్తలను పిరమిడ్ సాయిమిరా వారు కొట్టిపారేస్తున్నారు. ఆ సంస్ధ ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ ఆ వార్తలు రూమర్స్ అనీ తామే ఈ సినిమాని చెయ్యబోతున్నామని అంటున్నాడు.ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతోందని వివరిస్తున్నారు.అలాగే ప్రారంభం గ్రాండ్ గా చెయ్యబోతున్నామని అదీ సెప్టెంబర్ లో జర్గుతుందని అంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X