twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ వేధింపులు: ‘క్వీన్’ దర్శకుడు అంత నీచానికి ఒడిగట్టాడా?

    బాలీవుడ్లో ‘చిల్లర్ పార్టీ’, ‘క్వీన్’ లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ బెహల్ మీద సెక్సువల్ వేధింపుల ఆరోపణల రావడం బాలీవుడ్లో.

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్లో 'చిల్లర్ పార్టీ', 'క్వీన్' లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ బెహల్ మీద సెక్సువల్ వేధింపుల ఆరోపణల రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అయితే వికాస్ మాత్రం తనకు ఏ పాపం తెలియదు అంటున్నారు.

    అయితే ఇది కేవలం ఆరోపణలతోనే ఆగిపోలేదు... అతడిపై అతడిపై కేసు పెట్టే వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో అతడి సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు చిత్రీకరణ నిలిపి వేసాయి.

    కేసు పెట్టిన యువతి

    కేసు పెట్టిన యువతి

    బాలీవుడ్ కి చెందిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి తనతో వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది. కొన్ని నెలల క్రితం వికాస్‌ ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడ తన పట్ల వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ యువతి ఆరోపణ.

    నాకు ఏ పాపం తెలియదు అంటున్న దర్శకుడు

    నాకు ఏ పాపం తెలియదు అంటున్న దర్శకుడు

    కేసు ముంబైలో నమోదు కాగా.... వికాస్ బెహల్ ఢిల్లీలో ఉన్నారు. ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ఆమె అసలు మా(ఫాంటమ్ ఫిల్మ్స్) ఉద్యోగిని కాదు అని దర్శకుడు తెలిపారు.

    క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే

    క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే

    నాపై ఫిర్యాదు చేసిన యువతితో కలిసి గతంలో కొన్ని సినిమాల్లో పని చేసారు. ఒకవేళ నేను తనతో అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటే తనతోనేరుగా వచ్చి కూర్చుని మాట్లాడతాను. మీ ముందే ఆమెని నిజనిజాలు అడుగుతాను. ఒకవేళ ఆమె విషయంలో తప్పు జరిగింది అనుకుంటే క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమే అని వికాస్ మీడియాకు తెలిపారు.

    ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుల్లో వికాస్ ఒకరు

    ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుల్లో వికాస్ ఒకరు

    ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ సంస్థ 2011 ప్రారంభం అయింది. దర్శకులు అనురాగ్‌ కశ్యప్‌, విక్రమాదిత్య మోత్వానే, మధు మంతెన, వికాస్‌ బెహల్‌ కలిసి ఈ సంస్థను ప్రారంభించారు.

    వికాస్ ను సంస్థ నుండి తొలగించారా?

    వికాస్ ను సంస్థ నుండి తొలగించారా?

    కాగా గోవాలో చిత్రీకరణజరుగుతున్న సమయంలో యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ చిత్రీకరణ నిలిపి వేసింది. సంస్థ నుండి కూడా వికాస్ ను తొలగించినట్లు పేర్కొంది. అయితే వికాస్ మాత్రం తాను పాంటమ్ ఫిల్మ్స్ లో ఇంకా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

    English summary
    Vikas Bahl, who directed the superhit woman-centric film Queen starring Kangana Ranaut has landed himself in a soup with sexual harassment charges pinned against him. A woman employee has accused him of misconduct during a Goa trip and revealed that he behaved inappropriately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X