హీరోయిన్ దొరకడం లేదంటూ దర్శకుడి ప్రెస్‌మీట్
హైదరాబాద్: కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కిన 'క్వీన్' చిత్రాన్ని తెలుగుతో పాటు దక్షిణాది బాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు.
దీంతో సినిమాపై ఫిల్మ్ సర్కిల్‌లో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు తెర దించేందుక త్యాగరాజన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఆయన మాట్లాడుతూ.... కంగనా రనౌత్ కథానాయికగా నటించిన ఆ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రూపొందించడానికి సరైన హీరోయిన్ దొరకడంలేదని, కాజల్, తమన్నా, అనుష్కలాంటి పేర్లు పలువురు వినిపిస్తున్నారని, అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశానని తెలిపారు.

ఆ సినిమా కథకు తగిన విధంగా నటనను చేసే నాయిక కోసం చూస్తున్నానని, ప్రస్తుతం త్రిష పరిశీలనలో ఉందని, త్వరలో హీరోయిన్ ఎవరో ప్రకటిస్తానని ఆయన అన్నారు. తన తనయుడు ప్రశాంత్ ఈ సినిమాలో నటిస్తానంటే తనకెటువంటి అభ్యంతరం లేదని, తాను మాత్రం అతనిని నటించమని అడగనని తెలిపారు. 'క్వీన్' చిత్రానికి కేవలం తాను నిర్మాతగా మాత్రమే ఉంటానని, దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











