కాజల్‌ని అక్కడ పట్టుకుని నొక్కేసింది.. రచ్చ రచ్చ చేసిన తమన్నా!

నార్త్‌లో విజయం సాధించిన చిత్రాల రీమేక్ కు సౌత్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వికాస్ బహల్ తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం క్వీన్ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించింది. ఈ చిత్రం కనగానని నటిగా మరో స్థాయికి చేర్చింది. అనేక అవార్డులు సైతం ఈ చిత్రానికి వచ్చాయి. లేడి ఓరియెంటెడ్ నేపథ్యంలోసాగే అద్భుతమైన కథ కావడంతో సౌత్ నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ కోసం ఎగబడ్డారు. తమిళంలో చందమామ కాజల్ అగర్వాల్, తెలుగులో మిల్కి బ్యూటీ తమన్నా క్వీన్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ ఈ చిత్ర టీజర్లు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

 దట్ ఈజ్ మహాలక్ష్మి

దట్ ఈజ్ మహాలక్ష్మి

తెలుగులో ఈ చిత్రం దట్ ఈజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కుతోంది. మను కుమారన్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి ఒంటరిగా పారిస్ కు హనీమూన్ కు వెళుతుంది. ఈ తెలుగు అమ్మాయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, వాటిని ఎలా అధికమించింది అనేదే ఈ చిత్ర కథ.

తమన్నా రచ్చ రచ్చ

ఈ చిత్ర టీజర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమండ్రి నుంచి పారిస్ వెళ్లిన తెలుగు అమ్మాయిగా తమన్నా నటన ఇరగదీసినట్లు టీజర్ లో కనిపిస్తోంది. టీజర్ లో చాలా సరదాగా సాగే డైలాగులు ఉన్నాయి. మై సెల్ఫ్ మహాలక్ష్మి.. నేను నా హనీమూన్ కి వచ్చాను అంటూ తమన్నా మద్యం మత్తులో చెప్పే డైలాగ్ చాలా బావుంది. మా రాజమండ్రిలో ఓ బ్రిడ్జి ఉంది.. దాన్ని ఇలా నిలుచోబెడితే మీ ఈఫిల్ టవర్ ఉంది కదా.. అది ఉడతలా కనిపిస్తుంది అంటూ తమన్నా ఫన్నీ డైలాగులతో అదరగొడుతోంది. అమిత్ త్రివేది చిత్రానికి అవసరమైన మంచి బ్యాగ్రౌండ్ సంగీతాన్ని అందించారు.

పారిస్ పారిస్ అంటూ కాజల్ అగర్వాల్

ఇక తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పారిస్ పారిస్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రానికి ఒకే నిర్మాత. మను కుమారన్ తమిళ తెలుగు, మలయాళీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ కూడా మంచి నటన కనబరిచింది. అల్లరి పిల్లగా ఈ చిత్రంలో నటిస్తోంది. పారిస్ పారిస్ టీజర్ లో ఓ పారిస్ అమ్మాయి కాజల్ అగర్వాల్ యదని పట్టుకుని నొక్కే సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంజిమ మోహన్

ఇదే చిత్రాన్ని మలయాళంలో జామ్ జామ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. బటర్ ఫ్లై పేరుతో కన్నడలో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. పరుల్ యాదవ్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అన్ని భాషల్లో టీజర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X