»   » విబేధాలా? వరుణ్ తేజ్ మూవీ ఓపెనింగ్‌లో చిరు-పవన్ ఎందుకలా?

విబేధాలా? వరుణ్ తేజ్ మూవీ ఓపెనింగ్‌లో చిరు-పవన్ ఎందుకలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Difference between Pawan Kalyan and Chiranjeevi?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య పొసగడం లేదని తరచూ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగా కుటుంబ సభ్యులు మాత్రం మొదటి నుండీ ఈ విషయాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా తన సోదరుడితో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద్దన్నయ్య నాకు గురువు లాంటి వాడని చెప్పుకొచ్చారు.

అయితే గురువారం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎడమొహం, పెడమొహంగా కనిపించడం చర్చనీయాంశం అయింది. ఇదరూ ఎదురు పడినా కనీసం పలకరించుకోక పోవడంపై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి చేతుల మీదుగా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమం మొత్తం మెగాస్టార్ చేతుల మీదుగానే జరిగింది. పవన్ కళ్యాణ్ అలా వచ్చి ఇలా వెళ్లి పోయారు. వరుణ్ తేజ్ ఎంట్రీ గురించి నాలుగు ముక్కలు మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైనం పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదనే గాసిప్స్ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రాఘవేంద్రరావు, వివి వినాయక్, తదితరులు హాజరయ్యారు.

English summary
Power Star Pawan Kalyan and Mega Star Chiranjeevi are 2 top heroes in Tollywood film industry. Both these stars belong to the same family and both these stars strive hard to achieve success. There are several similarities between Chiru and Pawan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu