Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'గన్' తిప్పుతూనే వున్నా- మురుగన్
తెలుగులో హాస్యరస చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ 'రాజేంద్ర ప్రసాద్'. ప్రేక్షకులను కంట తడి పెట్టించడంలో(ఆనందంతో నైనా, బాధతోనైనా) ఆయకు ఆయనే సాటి. గత 32 ఏళ్లుగా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షక హృదయాలలో పదిలమైన చోటు సంపాదించుకున్న 'నటకిరీటి' ఆయన.
తాజాగా ఆయన కౌబాయ్ గా నటించిన చిత్రం 'క్విక్ గన్ మురుగన్'. ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆంగ్లం, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 28న విడుదల కాబోతోంది. తెలుగులో సెప్టెంబరు 24న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించారు.
రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం గురించి చెబుతూ "ఇది నా 32 ఏళ్ల సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని" అన్నారు. తానీ చిత్రంలో కౌ-బాయ్ గా కనిపిస్తానని చెప్పారు. మాంసాహారం పేరుతో జీవహింస చేసే వారి పని పడుతుంటానని, ఈ క్రమంలో రైస్ ప్లేట్ రెడ్డి, రౌడీ ఎంపీఏల చేత హత్యకు గరవుతానని, తిరిగి తాను భూమ్మీదకు కొన్ని అధ్బతమైన శక్తులతో తిరిగొచ్చి అసలైన పోరాటం చేస్తానని చెప్పారు.
ఏడాది క్రితం ప్రారంభమైన ఈ చిత్రం కోసం తాను మొదటి రోజు నుండీ ఈ రోజు వరకూ గన్ తిప్పుతూనే వున్నానని, సుమారు 15 వేల బులెట్లు వాడుంటామని చెప్పారు.. ఇందులో 'మైండ్ ఇట్' అనేది తన ఊత పదం అనీ, ఈ మ్యానరిజం ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఇంకా ఇందులో నాజర్, రాజసుందరం, రంభ తదితరులు నటించారు.