'గిన్నీస్ బుక్' కోసం మురుగన్ దోశ
శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ప్యాట్ ఫిష్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడం కోసం భారీ దోశను ఆయన తయారు చేసే సన్నివేశాన్ని అహ్మదాబాద్ లోని సంకల్ప రెస్టారెంట్ లో బుధవారం చిత్రీకరించారు. ఇప్పటివరకూ 30 అడుగుల పొడవున్న దోశ గిన్నీస్ బుక్ రికార్డ్స్లో నమోదయిఉంది. దానిని అధిగమించే ప్రయత్నంలో 16 మంది కుక్స్ సాయం చేయగా 40 నిముషాలో ఈ దోశను రాజేంద్రప్రసాద్ తయారుచేశారు. శాకాహారాన్ని సమర్థించే హీరోకు, మాంసాహారాన్ని బలపరిచే విలన్ కు మధ్య జరిగే సమరం కథాంశంగా రూపుదిద్దుకుంటున్న ఆంగ్ల చిత్రం 'క్విక్ గన్ మురుగన్"లో డా.రాజేంద్రప్రసార్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ ప్రతినిది వివేక్ కృష్ణాని మాట్లాడుతూ 'శాకాహారం ప్రాముఖ్యాన్ని తెలిపే ఇతివృతంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దక్షిణాదిన పేరొందిన దోశను భారీ స్థాయిలో తయారు చేసే సన్నివేశం ఉంటే బాడుంటుందని ఆలోచించి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాం" అన్నారు. శాకాహార, మాంసాహార ప్రియు ఏవిధంగా ఈ చిత్రాన్ని ఆస్వాధిస్తారో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











