ఆర్.నారాయణ మూర్తి 'పీపుల్స్ వార్' విడుదల తేదీ
అలాగే రైతుకు భూమి మిగల్లేదు. కార్మికుడికి ఉపాధి దొరకలేదు. మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దురాగతాలన్నింటికీ మన పాలకులు పెట్టిన అందమైన పేరు... అభివృద్ధి. ఈ ధోరణిని అడ్డుకొనేందుకు నడుం బిగించారు ఆ గ్రామ ప్రజలు. ధర్మయుద్ధంలా సాగిన ఈ పోరాటంలో ఎవరు గెలిచారో తెరపైనే చూడాలంటున్నారు ఆర్.నారాయణమూర్తి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని పర్యావరణ వినాశనాన్ని చూపించానని, వ్యవసాయ యోగ్య భూముల్లో పరిశ్రమలు పెట్టడానికి తాను పూర్తి వ్యతిరేకినని, అదే ఈ సినిమాలో చెప్పానని ఆర్.నారాయణమూర్తి వివరించారు.
ఇక ''సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన గున్నా జోగారావు పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. పర్యావరణాన్ని బూడిద కుప్పలుగా మార్చేసే ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలే ఈ చిత్రంలో ప్రతినాయకులు. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. వ్యవసాయ భూముల్ని పరిశ్రమలకు వినియోగించకూడదంటూ ఇటీవల నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వాళ్లు వాన్‌పిక్ ప్రాజెక్టు భూముల్లో ఏరువాక చేసొచ్చారు. ఇదంతా మంచిదే. అయితే వాళ్ల ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమే ఈ పారిశ్రామిక విధానాలు'' అన్నారు.
సినిమాలో ఇందులో నాతో పాటు శ్రీహరి, పోసాని కృష్ణమురళి, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు. సోంపేట, కాకరాపల్లి, ఏరవాడ, రామగుండం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. క్లైమాక్స్‌లో వచ్చే 'పోరు దారిలో పోదమా' పాటను అల్లం వీరన్న రాయగా, వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. ఈ పాట ఈ సినిమాలో ఒక హైలైట్'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications












