పనికిమాలిన సినిమాలకు నందులా? ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం
విప్లవ చిత్రాల నారాయణమూర్తి తాజాగా నంది అవార్డులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక చైతన్యంతో తీసే తన చిత్రాలు ఏ కోణంలో నంది అవార్డుకు అర్హత సంపాదించలేకపోయేయో చెప్పమంటున్నాడు. నంది అవార్డుల ఎంపికలో రాజకీయం జరిగిందని ఆక్రోశిస్తున్నాడు. తన సమాజం ఎదుర్కోంటున్న ఓ తీవ్రమైన సమస్యపై దేవరకొండ వీరయ్య చిత్రం తీస్తే అవార్డు ఇచ్చి ప్రోత్సహించలేదంటున్నాడు. అలాగే పనికిమాలిన చిత్రాలకు నందులు ఇస్తున్నారంటూ ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆవేశంతో ప్రశ్నించాడు. మంచి సినిమాలు తీయండంటూనే సెక్స్ సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని మరో వివాదానికి తెర లేపుతున్నాడు.ఇంకొంత కాలం ఆగితే నంది అవార్డులు ప్రెవేట్ అవార్డుల్లా మారినా ఆశ్చర్యపోనవసం లేదని అన్నారు. అలాగే అవార్డుల కమిటీ ఉన్నా అది రాజకీయాలకు లోబడి పనిచేస్తోందని,పలుకుబడి ఉపయోగించి అవార్డు తెచ్చుకోవటం సర్వ సాధారణం అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల సొమ్ముతో ఇచ్చే అవార్డులు కాబట్టే తాను ఇంతలా మాట్లాడాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఆవేదనలో కూడా అర్దం ఉంది కదా.


Click it and Unblock the Notifications











