‘ఏ పిల్లా’ అంటూ దడదడలాండించిన నారాయణమూర్తి.. కంగన రౌనత్‌‌ను కంగారు పెట్టించి..

బాహుబలి ఫేం విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగన రనౌత్ కాంబినేషన్‌లో రూపొందిన మణికర్ణిక చిత్రం జనవరి 25న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని జీవీకే మాల్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్ నారాయణమూర్తి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ..

 బాలీవుడ్‌లో నటించాలని

బాలీవుడ్‌లో నటించాలని

ఒకప్పుడు హిందీ సినిమాలు చూడాలని, బాలీవుడ్‌లో నటించాలని కలలుకనే వాళ్లం. అలాగే బాలీవుడ్ వాళ్లు హాలీవుడ్‌లో నటించాలని కోరుకొన్నారు. ఆ సమయంలో జెమినీ పిక్చర్స్ వారు చంద్రలేఖ సినిమా తీశారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్, పద్మాలయ, రామానాయుడు హిందీ రంగంలోకి ప్రవేశించి అద్భుతమైన సినిమాలు రూపొందించారు.

తెలుగువాడిగా గర్వపడుతున్నా

తెలుగువాడిగా గర్వపడుతున్నా

ప్రస్తుత పరిస్థితుల్లో ఓ తెలుగువాడిగా గర్వపడుతున్నాను. మణికర్ణిక సినిమా టైటిల్స్‌లో కథ, స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ అని చూసినప్పుడు పులకరించిపోయాను. అలాగే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అని చూసినప్పుడు మరింత సంతోషం కలిగింది.

విజయేంద్ర ప్రసాద్ జాతీయ రచయిత

విజయేంద్ర ప్రసాద్ జాతీయ రచయిత

తెలుగు జాతి, తెలుగు నేల ఖ్యాతిని చాటిచెప్పిన విజయేంద్రప్రసాద్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విజయేంద్ర ప్రసాద్ జాతీయ రచయిత అంటూ ప్రసంగిస్తూంటే.. ఓ రిపోర్టర్ ఇంటర్నేషనల్ రైటర్ అని కామెంట్ చేయడంపై నారాయణమూర్తి స్పందించారు. పిల్లా భలే చెప్పావు. తథాస్తు అంటూ దీవించారు.

కంగన రనౌత్ రియల్లీ హ్యాట్సాఫ్

కంగన రనౌత్ రియల్లీ హ్యాట్సాఫ్

మణికర్ణిక సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ అవకాశం రాగా.. మీరు చేయండని క్రిష్‌ను కోరి. మిగితా సినిమాను తాను డైరెక్ట్ చేసినని చెప్పి అమోఘంగా తెరకెక్కించినందుకు కంగనా రౌనత్‌ను అభినందించారు. రాజమౌళి తండ్రి అనే పక్కన పెడితే సినిమా చరిత్రలో అద్భుతమైన చిత్రాలు అందించిన ఘనత విజయేంద్ర ప్రసాదే అని నారాయణ మూర్తి అన్నారు.

తన కూతురు పేరునే టైటిల్‌గా

తన కూతురు పేరునే టైటిల్‌గా

తెలుగులో సమర సింహారెడ్డి, బొబ్బిలిసింహం లాంటి సినిమాలో కాకుండా ప్రధాని, రాష్ట్రపతి మాట్లాడుకొనే విధంగా బాహుబలి కథను రాశాడు. అలాంటి గొప్ప రైటర్ ఇప్పుడు ఝాన్సీ రాణి కథతో మణికర్ణిక సినిమాను రూపొందించారు. తన కూతురు మణికర్ణిక పేరు ఈ సినిమాకు పెట్టడం గొప్ప విషయం.

పరిశ్రమలో అన్యాయాలను ఎదురిస్తూ

పరిశ్రమలో అన్యాయాలను ఎదురిస్తూ

కంగన రనౌత్ ఆడపిల్ల కానీ.. సినీ పరిశ్రమలో ఎన్నో అన్యాయాలను నిలదీస్తున్న వీర వనిత. మీటూ, యూటూ అంటూ అక్రమాలను నిలదీస్తున్న కంగన రౌనత్‌ను అభినందించాలి. అలాంటి సినిమాలో అద్భుతమైన పాత్రను చేసిన కంగన రనౌత్ హ్యాట్సాఫ్. మణికర్ణిక సెన్సేషనల్ హిట్ కావాలి అని నారాయణమూర్తి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X