'దూకుడు'తో నా సినిమా నలిగిపోయింది
'దూకుడు' లాంటి పెద్ద చిత్రాల మధ్య నా సినిమా నలిగిపోయింది. అందుకే నా 'పోరు తెలంగాణ'సినిమాని మరోసారి విడుదల చేస్తున్నా. నైజాంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అంటున్నారు ఆర్.నారాయణమూర్తి. ఈ నెల 31న విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాకు ఈ విషయం తెలియచేసారు నారాయణ మూర్తి. అలాగే ఇప్పటికే పలు సమస్యలపై సినిమాలు తీశాను. ఓ కళాకారుడిగా భావ ప్రకటనా స్వేచ్ఛనాకుంది. అందుకే తెలంగాణ ఉద్యమంపై సినిమా తీశాను. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా రాష్ట్రాలను విభజించడంలో తప్పులేదు. అప్పుడు అన్ని పట్టణాలూ అభివద్ధి చెందుతాయి. ఈ విషయాన్నే సినిమాలో చెప్పాను. నా సినిమాని ఆ కోణంలోనే చూడాలని అన్నారు. ఇక 'పోరు తెలంగాణ'చిత్రం సకల జనుల సమ్మె నేపథ్యంలో విడుదలైంది.


Click it and Unblock the Notifications











