ఆర్ నారాయణమూర్తి అస్వస్థత.. నిమ్స్ ఐసీయూలో చికిత్స
వామపక్ష భావాలు, సిద్దాంతాలే నేపథ్యంగా సామాజిక అంశాలను జోడించి చిత్రాలను నిర్మించే రెడ్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఉండే వైద్యుల పర్వవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకోకపోగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఆయనను నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యానికి గురించిన వివరాల్లోకి వెళితే..
ఆర్ నారాయణ మూర్తిని ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వైద్య వర్గాలు వెల్లడించాయి.

అయితే ఆయనకు ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. పలువురు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అని వైద్యులు తెలిపారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొన్న ఆయన రెండు రోజులుగా నీరసంగా ఉన్నారు. దాంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించి తన సోదరుడు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వైద్యులు పలు టెస్ట్‌లు చేసి తగిన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











