ఏయ్ పాప.. రంభ, ఊర్వశి, మేనక అంటూ.. కావ్య థాపర్‌ను ఆట్ట పట్టించిన నారాయణ మూర్తి

2016లో విడుదలైన బిచ్చగాడు సినిమా సంచలన విజయం అందుకొన్నది. హీరో విజయ్ ఆంటోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. అలాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్‌గా బిచ్చగాడు 2 మూవీతో విజయ్ ఆంతోని సిద్ధమయ్యారు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ..

బిచ్చగాడు సంచలన విజయం: తెలుగు సినిమా పరిశ్రమలో ఏలూరుకు చెందిన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రముఖ డిస్టిబ్యూటర్ ఉషా పిక్చర్స్ భారతి గారి అబ్బాయి బిచ్చగాడు 2 సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను భారీ పోటీ మధ్య చేజిక్కించుకొన్నారు. బిచ్చగాడు లాంటి భారీ హిట్‌కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా కావడంతో మంచి కాంపిటీషన్ ఉంది. బిచ్చగాడు సినిమాను చదలవాడ శ్రీనివాసరావు అప్పట్లో కొని రికార్డు లాభాలను సాధించాడు. అలాంటి స్టోరిపై ఉన్న నమ్మకంతో బిచ్చగాడు 2 మూవీని ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ కొన్నారు. నీ నమ్మకం వమ్ము కాకూడదని నేను విషెస్ చెబుతున్నాను అని నారాయణ మూర్తి అన్నారు.

Bichagadu press meet

విజయ్ ఆంటోని అనారోగ్యం నుంచి బయటపడి..: విజయ్ ఆంథోని మృత్యుంజయుడు. ఎలాంటి సినిమాలు తీశాడో మనకు తెలుసు. తల్లి ప్రేమను పొందడం, తల్లి ప్రాణాలు కాపాడుకోవడం గురించి బిచ్చగాడు తీసి అందర్నీ ఆకట్టుకొన్నాడు. అప్పట్లో బలగం సినిమా గురించి ఎలా మాట్లాడుకొంటున్నారో అప్పట్లో బిచ్చగాడు గురించి అలా మాట్లాడుకొన్నారు. సినిమా పరిశ్రమలో మరో మనోజ్ కుమార్, టీ రాజేందర్, గురుదత్ అంటూ ప్రశంసలతో ఆర్ నారాయణ మూర్తి ముంచెత్తారు.

Bichagadu press meet

ఈ పాప పేరు ఏంటి?: ఇక కావ్య థాపర్‌ను చూస్తూ.. ఏయ్ పాప.. ఈ పాప పేరు ఏంటి? అంటే.. కావ్య థాపర్‌ అని చెప్పగానే.. మీడియా మిత్రుల్లారా మీరు మరోలా రాయకండి అంటూ ప్రాధేయపడ్డారు. సినిమాల్లో రంభ, ఊర్వశి, మేనకలను చూశాం. అలాంటి రంభ, ఊర్వశీ, మేనక ల్లాంటి హీరోయిన్లు మన కళ్లముందే తిరిగినట్టు ఉంది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

Bichagadu press meet

రోజులు మారాలి సినిమా ఏడాదికిపైగా: బిచ్చగాడు 2 సినిమా వేదికపై ఉన్న బిచ్చగాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్స్ తప్పనిసరి. ప్రమోషన్స్ లేకపోతే గొప్ప సినిమాలు కూడా కనుమరుగై పోతాయి. అప్పట్లో జెమినీ పిక్చర్స్ వారు రోజులు మారాలి అనే సినిమాను తీశారు. శోభన్ బాబు, శారద మొదటి రెండు వారాలు ఆడలేదు. జెమినీ వాసన్ గారు విమానంలో పాంప్లెట్స్ పంపారు. ఆ తర్వాత సంవత్సరం ఆడి చరిత్ర సృష్టించింది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

Bichagadu press meet

శంకరాభరణం, బిచ్చగాడు గురించి: అలాగే మాతృదేవో భవ సినిమాకు మొదటి వారం జనం లేరు. విజయవాడ అలంకార్ సినిమా థియేటర్ వద్ద కర్చిఫ్ లు పంచి సినిమాను మరో రేంజ్‌లో ప్రమోషన్ చేశారు. ఆతర్వాత శంకరభరణం, బిచ్చగాడు సినిమాలకు తొలి వారం కలెక్షన్లు లేవు. కానీ ఆ నిర్మాతలు మంచి పబ్లిసిటీ ఇచ్చి సినిమా నుంచి భారీ కలెక్షన్లు రాబట్టారు అని నారాయణ మూర్తి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X