వందేళ్ల వేడుకలో తెలుగు దర్శకుడికి అవమానం

సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ....వందేళ్ల సినిమా పండగలో తెలుగు వారిపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని, దాసరి నారాయణరావు లాంటి పెద్దలను ఈ వేడుకకు ఆహ్వానించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కె విశ్వనాథ్ లాంటి పెద్దలను కూడా వేదికపైకి ఆహ్వానించక పోవడం తెలుగు వారికి అవమానం కాకుంటే మరేమిటని ఆగ్రహం వ్యక్తం చేసారు. వందేళ్ల సినిమా ఫంక్షన్ ఆడియో వేడుకలా జరుగుతోందని విమర్శించారు.
కాగా....ఆర్ నారాయణమూర్తికి అవమానం జరిగిందనే వార్తలను నిర్మాత నట్టికుమార్ ఖండించారు. దాసరి నారాయణరావుతో పాటు అందరు పెద్దలకూ ఆహ్వానాలు అందాయని, మూడు రోజు దాసరి పాల్గొంటారని చెప్పుకొచ్చారు. వందేళ్ల సినిమా వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిన మాట వాస్తవమే అన్నారు.


Click it and Unblock the Notifications











