For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఢిల్లీ గ్యాంగ్ రేప్‌పై ఆర్. నారాయణమూర్తి చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా ఆర్‌.నారాయణమూర్తి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించే ఈ చిత్రానికి 'కలకత్తా కాళీ' అనే పేరుని ఖరారు చేశారు. ఈ నెల 23 నుంచి గోదావరిఖనిలో చిత్రీకరణ మొదలుపెడుతున్నుట్లు ఆయన సోమవారం కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలో వెల్లడించారు.

    నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ ఉద్యమ పోరాటాన్నీ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కిషన్‌జీ జీవితం, చేపట్టిన ఉద్యమాన్ని అందులో చూపిస్తామనీ, తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం ఉంటుందనీ ఆయన చెప్పారు.

    ఇక ఈ మధ్యనే...ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'పీపుల్స్‌ వార్‌'. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఇందులో హీరోలు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ఈ చిత్రంలో విలన్లు . శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    R. Narayana Murthy is all set to make a movie on Delhi Rape case victim. The movie is reportedly titled 'Kalakatta Kaali'. He himself revealed this to press in Yanam. The gang rape on Nirbhaya in Delhi and assault on her friend had created a huge uproar in the country. It later took the life of the innocent girl. That particular incident had questioned the security of women in National's capital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X