రేపిస్టులపై నారాయణమూర్తి ‘నిర్భయ భారతం’

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, వేధింపులను బేస్ చేసుకుని తాజాగా నారాయణ మూర్తి 'నిర్భయ భారతం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నారాయణ మూర్తి కాలేజీలో పని చేసే ప్యూన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన కూతురు సివిల్ ఎగ్జామ్స్ నిమిత్తం ఢిల్లీ వెళ్లి అత్యాచారానికి గురవుతుంది.
దీంతో పాటు ఇటీవల మహిలపై జరుగుతున్న దాడులు, వేధింపులు లాంటి సంఘటలను ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ప్రారంభం అయింది. ఈ సినిమా గురించి నారాయణ మూర్తి మీడియాకు వివరించారు.
మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని, అపరాధాలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో సాగుతుందని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో మైనర్లు కూడా భాగం అవతున్నారని, గంజాయి మొక్క చిన్నదైనా చెడ్డదే, వారిని కూడా శిక్షించాలి అనే డిమాండ్ తో సినిమా ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











