అది బ్లాక్ దందానే.. ఇండస్ట్రీ పెద్దలపై నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్, జగన్ అంటూ..

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మరోసారి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర థ్యాంక్యూ మీట్‌లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడారు. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకులపై టిక్కెట్టు భారం మోపవద్దని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తొమ్మిది నెలలపాటు పురిటి నొప్పులు

తొమ్మిది నెలలపాటు పురిటి నొప్పులు

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం పురిటి నొప్పులు పడింది. దాదాపు 9 నెలలపాటు రిలీజ్ విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. నిర్మాత బీవీవీఎన్ ప్రసాద్ ఈ సినిమాను ఓ మంచి బిడ్డకు జన్మనిచ్చిన విధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు నిర్మాత ప్రసాద్‌ గారిని అభినందించాల్సిందే అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

టికెట్ రేట్లు పెంచకండి

టికెట్ రేట్లు పెంచకండి

థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ అనే కారణం చూపి టికెట్ల రేట్లు దయచేసి పెంచకండి. కరోనా కాలంలో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు కూడా కష్టాల పాలయ్యారు. కాబట్టి వారిపై టికెట్ల భారం వేయకండి. తాము నిర్మించే సినిమాలను ఎన్ని కోట్లు పెట్టైనా తీయండి కానీ వాటిని రాబట్టేందుకు టికెట్ రేట్లు పెంచవద్దు అని ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

సినిమా బాగుంటే కలెక్షన్లు వాటంతట అవే..

సినిమా బాగుంటే కలెక్షన్లు వాటంతట అవే..

టికెట్ రేట్ పెంచకుండా మాయబజార్, టైటానిక్ లాంటి చిత్రాలు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారు. టికెట్లు రేట్లు పెంచితే దానిని బ్లాక్ మార్కెటింగ్ అనరు. ఆథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్ అంటారు అని ఆర్ నారాయణమూర్తి ఆవేశంగా ప్రసంగించారు.

సీఎం కేసీఆర్, జగన్‌కు రిక్వెస్ట్

సీఎం కేసీఆర్, జగన్‌కు రిక్వెస్ట్

సినిమా పరిశ్రమలో బడా నిర్మాతలు, దర్శకులు టికెట్ల రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకోవద్దు. టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేయవద్దు. టికెట్ రేట్ల పెంపును ఖండించాలి. సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాంటి చర్యలను ప్రోత్సహించవద్దు అంటూ నారాయణమూర్తి రిక్వెస్ట్ చేశారు.

ఇండస్ట్రీ పెద్దలను ఇరుకున పెట్టిన పీపుల్స్ స్టార్

ఇండస్ట్రీ పెద్దలను ఇరుకున పెట్టిన పీపుల్స్ స్టార్

టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర పెద్దలను ఉద్దేశించి ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో నిర్మాతలను ఇరుకునపెట్టే విధంగా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. అయితే ఆయన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X