Just In
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పైశాచికత్వం నశించడం లేదు: ఆర్.నారాయణమూర్తి

నారారణ మూర్తి మాట్లాడుతూ... ''నిర్భయ చట్టం వచ్చినా... మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా... దేశంలో ఇంకా మృగాళ్ల పైశాచికత్వం నశించడం లేదు. దీనికి కారణం తప్పు చేసిన వెంటనే శిక్ష పడకపోవడమే. ఆ భయం లేకపోవడంతోనే ముంబయిలో అలాంటి ఘటన పునరావృతమైంది. సత్వర న్యాయం, శిక్ష ప్రాధాన్యమేంటో మా సినిమాలో చూపిస్తున్నాం. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించారు. ఇటీవల విడుదలైన పాటలకి మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాము''అన్నారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, వేధింపులను బేస్ చేసుకుని తాజాగా నారాయణ మూర్తి 'నిర్భయ భారతం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నారాయణ మూర్తి కాలేజీలో పని చేసే ప్యూన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన కూతురు సివిల్ ఎగ్జామ్స్ నిమిత్తం ఢిల్లీ వెళ్లి అత్యాచారానికి గురవుతుంది. దీంతో పాటు ఇటీవల మహిలపై జరుగుతున్న దాడులు, వేధింపులు లాంటి సంఘటలను ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని, అపరాధాలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో సాగుతుందని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో మైనర్లు కూడా భాగం అవతున్నారని, గంజాయి మొక్క చిన్నదైనా చెడ్డదే, వారిని కూడా శిక్షించాలి అనే డిమాండ్ తో సినిమా ఉంటుందన్నారు.