twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైశాచికత్వం నశించడం లేదు: ఆర్‌.నారాయణమూర్తి

    By Srikanya
    |

    R Narayana Murthy
    హైదరాబాద్ :ఆర్‌.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'నిర్భయ భారతం'. నాన్సీ ఏంజిల్‌, స్పందన ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాము ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. భయం లేకపోవడంతోనే ముంబయిలో అలాంటి ఘటన పునరావృతమైందని అని అన్నారు.

    నారారణ మూర్తి మాట్లాడుతూ... ''నిర్భయ చట్టం వచ్చినా... మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా... దేశంలో ఇంకా మృగాళ్ల పైశాచికత్వం నశించడం లేదు. దీనికి కారణం తప్పు చేసిన వెంటనే శిక్ష పడకపోవడమే. ఆ భయం లేకపోవడంతోనే ముంబయిలో అలాంటి ఘటన పునరావృతమైంది. సత్వర న్యాయం, శిక్ష ప్రాధాన్యమేంటో మా సినిమాలో చూపిస్తున్నాం. సెన్సార్‌ సభ్యులు సినిమా చూసి ప్రశంసించారు. ఇటీవల విడుదలైన పాటలకి మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాము''అన్నారు.

    మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, వేధింపులను బేస్ చేసుకుని తాజాగా నారాయణ మూర్తి 'నిర్భయ భారతం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నారాయణ మూర్తి కాలేజీలో పని చేసే ప్యూన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన కూతురు సివిల్ ఎగ్జామ్స్ నిమిత్తం ఢిల్లీ వెళ్లి అత్యాచారానికి గురవుతుంది. దీంతో పాటు ఇటీవల మహిలపై జరుగుతున్న దాడులు, వేధింపులు లాంటి సంఘటలను ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

    మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని, అపరాధాలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో సాగుతుందని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో మైనర్లు కూడా భాగం అవతున్నారని, గంజాయి మొక్క చిన్నదైనా చెడ్డదే, వారిని కూడా శిక్షించాలి అనే డిమాండ్ తో సినిమా ఉంటుందన్నారు.

    English summary
    R Narayana Murthy is currently producing and directing a film titled Nirbhaya Bharatam. This film deals with the rapes and atrocities of women. R Narayana Murthy plays the role of peon in a college whose daughter goes to Delhi for civil exams and gets raped over there.
 
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X