twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి 'కొమరం భీమ్' జాతీయ పురస్కారం

    తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతీ ఏడాది అందించే ప్రతిష్టాత్మక "కొమరం భీమ్ జాతీయ పురస్కారం"

    By Rajababu
    |

    తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతీ ఏడాది అందించే ప్రతిష్టాత్మక "కొమరం భీమ్ జాతీయ పురస్కారం" 2017 గాను కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న) సందర్భంగా పీపుల్ స్టార్, సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తిని ఎంపిక చేసినట్లుగా అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ చారీ, కో చైర్మన్ నాగబాల సురేష్ కుమార్, కొమరం సోనీ రావు, శిడాం శంభు, శిడాం అర్జు ఈ అవార్డును ప్రకటించారు.

    గతంలో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. ఈ నెల 3వ వారంలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో 51 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ తెలిపారు.

    R Narayana Murthy selected for Komuram Bheem National Award

    జల్ జంగిల్ జమీన్ నినాదంతో గోండు ప్రజల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం సాయుధ పోరాటం చేసిన అమర యోధుడు కొమరం భీమ్ ఆశయ సాధనలో అదీ స్ఫూర్తి తో నటుడు నిర్మాత దర్శకుడు ఆర్ .నారాయణ మూర్తి పలు చలన చిత్రాలు నిర్మించి ప్రజలను చైతన్య వంతులుగా మార్చిన పీపుల్ స్టార్ నారాయణ మూర్తి.

    అర్దరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం,దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు,దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలను రూపొందించి కొమరం భీమ్ ఆశయాలకు అనుగునంగా నిర్మించినవే కావున ఆర్ నారాయణ మూర్తి ఈ అవార్డు ఇవ్వడం సమంజసమని కె వి రమణ చారీ అన్నారు.

    English summary
    R Narayana Murthy selected for Komuram Bheem National Award. Telangana Governments Chief advisor KV Ramana Chary headed committee has been selected him. This award will be present to Narayana Murthy on October 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X