సీఎంపై నారాయణమూర్తి సెన్సేషనల్ కామెంట్స్.. పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా..

విలక్షణ నటన.. సామాజిక అంశాలు ఉన్న సినిమాలు తీస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. సామాజిక స్ఫృహతో కూడిన సినిమాలు తీస్తూ ఎంతో మందిని చైతన్యవంతులను చేసిన ఈయన తాజాగా నటించిన చిత్రమే 'మార్కెట్‌లో ప్రజాస్వామ్యం'. 'క్యాడర్ వర్సెస్ లీడర్' అనేది ఉప శీర్షిక. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నారాయణమూర్తి నటనకు, డైరెక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. దీంతో ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, ఇందులో కుటుంబ విలువలు మంచిగా చూపించారని అంటున్నారని చెప్పారు. అలాగే, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించిందని నారాయణమూర్తి వెల్లడించారు.

R. Narayana Murthy Sensational Comments On CM

ఈ సినిమా ఫలితం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ పీపుల్స్ హీరో తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. మంగళవారం విజయనగరం జిల్లాలో సందడి చేశారు. నగరంలోని సప్తగిరి థియేటర్‌లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థతుల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్న దానిపై కామెంట్ చేశారు.

అలాగే, పార్టీ ఫిరాయింపులపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం దారుణంగా తయారైంది. రాజకీయ నాయకులు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఎక్కువైపోతున్నాయి. దీన్ని తెలియజేయడం కోసమే 'మార్కెట్‌లో ప్రజాస్వామ్యం' అనే సినిమా తీశాను. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయం. రాజీనామా చేస్తేనే తన పార్టీలోకి తీసుకుంటానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఆయనలా అందరూ చేస్తే ఫిరాయింపులు అనేవే ఉండవు'' అంటూ ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X