రైతన్నల కష్టాలపై ఆర్ నారాయణ మూర్తి ‘అన్నదాత సుఖీభవ’
Recommended Video

సంచలన సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకమా....?
స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి రూపొందిస్తున్న కొత్త చిత్రం ''అన్నదాత సుఖిభవ''. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ సినిమా రైతుల ఆత్మహత్యలకు నిరసనగా నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలను, రైతుల తాలూకు బాధలను, పంటపైన వచ్చే గిట్టుబాటు ధరను గురించి చర్చిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వుంటుంది అని అన్నారు. 'అన్నదాద సుఖీభవ' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సంక్రాతి సమయంలో విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నామని నారాయణ మూర్తి తెలిపారు.


Click it and Unblock the Notifications











