twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి తప్పటడుగు, దేశం మొత్తం ఏడ్చింది, ఆమె చరిత్ర ఒక సందేశం: ఆర్ నారాయణ మూర్తి

    |

    Recommended Video

    Rakul Preet Singh Launches Athiloka Sundari Sridevi Katha Book | Filmibeat Telugu

    ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుంద‌రి శ్రీదేవి క‌థ‌ పుస్త‌కావిష్కరణ బుధవారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ రానాయణ మూర్తి శ్రీదేవి గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు.

    శ్రీదేవిగారిని మనం బాలనటిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ పాపను నేను మొదట మా గురువు దాసరి గారు తీసిన 'బంగారక్క' సినిమా సమయంలో చూశాను. 16 ఏళ్ల వయసు సినిమా తర్వాత శ్రీదేవి స్టార్ డమ్ బీభత్సంగా పెరుగుతూ వచ్చిందని నారాయణ మూర్తి తెలిపారు.

    అన్ని క్వాలిటీస్ ఉన్న నటి

    అన్ని క్వాలిటీస్ ఉన్న నటి

    తెలుగులో అతిలోక సుందరి లాంటి గొప్ప సినిమాలు చేసింది. హిందీలో ‘హిమ్మత్‌వాలా'తో స్టార్ హీరోయిన్ అయింది. శ్రీదేవిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అందం, అభినయం, డిసిప్లిన్, డాన్స్ ఇలా అన్నీ ఉన్న అతిలోక సుందరి ఆమె. రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు ... అని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

    ఆమె చనిపోయినపుడు దేశం మొత్తం ఏడ్చింది

    ఆమె చనిపోయినపుడు దేశం మొత్తం ఏడ్చింది

    భారతదేశంలో మహ్మద్ రపీ, రాజేష్ ఖన్నా లాంటి స్టార్స్ చనిపోయినపుడు దేశం మొత్తం ఏడ్చింది. అలాగే శ్రీదేవిగారు చనిపోయినపుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కంటతడి పెట్టారు. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా ఎంతో మందికి ఆమె ఆరాధ్యనటి.

    శ్రీదేవి తప్పతడుగు మనకు ఒక సందేశం

    శ్రీదేవి తప్పతడుగు మనకు ఒక సందేశం

    మహానటి సావిత్రిగారి చరిత్ర వల్ల ఏ మనిషికైనా ఎకనామికల్ డిసిప్లిన్, హెల్త్ డిసిప్లిన్ రెండూ లేకుంటే ఏమవుతుందో తెలిసింది. శ్రీదేవి చరిత్ర వల్ల... ఏ మనిషైనా జీవితంలో తెలిసో, తెలియకో తప్పటడుగు వేస్తే ఆ అడుగు జీవితాన్ని ఎక్కడి వరకు తీసుకెళుతుంది అనేది తెలిసింది. ప్రియమైన ప్రజలారా మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు కానీ మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి... జీవితంలో తప్పడుగు వేయకండి అని సందేశం ఇచ్చి వెళ్లి పోయిన మహాతల్లి శ్రీదేవి అని... ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

    మనందరం వారి తీపి గుర్తులమే

    మనందరం వారి తీపి గుర్తులమే

    మహాకవి ఆత్రేయగారు చెప్పినట్లు పోయినోల్లు అందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు... మనందరం వారి తీపి గుర్తులమే. ఆ గుర్తులను రామారావుగారు ఈ పుస్తకం ద్వారా మనకు అందించినందుకు ధన్యవాదాలు.

    English summary
    R Narayana Murthy speech at Sridevi Katha book launch. Sridevi Biography Athiloka Sundari Katha Book Launch at Hyderabad. Rakul Preet Singh, Dil Raju, BVSN Prasad, Sivaji Raja, Narayana Murthy, K Atchi Reddy at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X