Don't Miss!
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ఆర్ నారాయణ మూర్తి ఇంట తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా విప్లవ భావాలు ఉన్న సినిమాలు చేస్తూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో ఆయన తెలుగు వారందరికీ దగ్గరయ్యారు. వివాహం కూడా చేసుకోకుండా ఆయన సినిమాలే ధ్యాసగా ప్రజల సంక్షేమమే పరమావధిగా పని చేస్తూ ఉంటారు. తాజాగా అయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

వయోభారంతోనే
పీపుల్స్
స్టార్
గా
పేరున్న
ఆర్
నారాయణ
మూర్తి
మాతృ
మూర్తి
చిట్టెమ్మ
కన్నుమూశారు.
ఏపీలోని
కాకినాడ
జిల్లా
రౌతులపూడి
మండలం
మల్లం
పేటలోని
నారాయణ
మూర్తి
స్వగృహంలో
రెడ్డి
చిట్టెమ్మ
మృతి
చెందారు.
ఆమె
వయసు
93
సంవత్సరాలు
కాగా
వయోభారంతోనే
ఆమె
కన్నుమూసినట్టు
ప్రచారం
జరుగుతోంది.
ఇక
ఆర్.నారాయణ
మూర్తి
కేవలం
నటుడిగానే
కాకుండా
స్క్రీన్
రైటర్‌గా,
దర్శకుడిగా,
గాయకుడిగా,
డాన్సర్‌గా,
నిర్మాతగా
తెలుగు
సినిమా
పరిశ్రమకు
సేవలు
అందిస్తున్న
సంగతి
తెలిసిందే.

మంచి పేరు
సినీ రంగ ప్రవేశం కోసం చాలా ఇబ్బందులు పడి ఎలాగో కృష్ణ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆయన తరువాత డిగ్రీ చదివేందుకు మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయాడు. ఆ తరువాత నటుడిగా మారిన ఆయన హీరోగా అనేక సినిమాలు కూడా చేసారు. తరువాతి కాలంలో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ తో సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో బహిర్గతం చేసే సమాంతర చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా ఆయన మంచి పేరు సంపాదించారు.

మంచి పేరు
అలా
'అర్ధరాత్రి
స్వతంత్య్రం',
అడవి
దివిటీలు,
లాల్
సలాం,
దండోరా,
ఎర్ర
సైన్యం,
చీమల
దండు,
దళం,
చీకటి
సూర్యుడు,
ఊరు
మనదిరా,
వేగు
చుక్కలు
లాంటి
సినిమాలతో
ఆయన
తెలుగు
ప్రేక్షకులకు
దగ్గరయ్యారు.
నిజానికి
దాసరి
నారాయణ
రావు,
అగ్ర
నిర్మాత
రామానాయుడు
ప్రోత్సాహంతో
ఎన్నో
సినిమాల్లో
సహాయక
పాత్రలలో
నటించారు
నారాయణ
మూర్తి.
దాసరి
తెరకెక్కించిన
సంగీత
అనే
సినిమాలో
ప్రధాన
పాత్రలో
నటించారు.

సొంతంగా నిర్మిస్తే తప్ప
యాభై రోజుల పాటు ఆడిన ఈ సినిమా తరువాత కూడా కథానాయకుడిగా అవకాశాలు రాక ఇక తనను హీరోగా పెట్టి ఎవరూ సినిమాలు తీయారేమో అని అనుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడిగా నిలుదొక్కుకుంటే హీరోగా మారవచ్చన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అయితే దర్శకత్వ శాఖలో అనుభవం లేని కారణంగా... సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కూడా రాలేదు నారాయణ మూర్తికి. దాంతో, తనే సినిమాను సొంతంగా నిర్మిస్తే తప్ప తనకు దర్శకత్వ బాధ్యతలు రావని ఒక నిర్ణయానికి వచ్చారు.

పెళ్లి కూడా లేకుండా
ఈ క్రమంలో స్నేహితులు సహకరించడంతో స్నేహ చిత్ర అనే సొంత నిర్మాత సంస్థను స్థాపించారు. తన ప్రజా జీవితాన్ని తనకొచ్చే జీవిత భాగస్వామి ఎక్కడైనా వ్యతిరేకిస్తుందేమోననే సందేహంతో నారాయణమూర్తి వివాహం చేసుకోలేదని చెబుతూ ఉంటారు. అయితే, తాను పెళ్లి చేసుకోనందుకు ఎంతో బాధపడుతునాన్నని పలు ఇంటర్వ్యూల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.