twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు లేకపోతే సావిత్రి జీవితం మాదిరిగానే.. నాగఅశ్విన్ హాట్సాఫ్.. ఆర్ నారాయణమూర్తి

    |

    Recommended Video

    మహానటి టీం పై ప్రసంశలు వర్షం కురిపించిన ఆర్ నారాయణమూర్తి

    విప్లవాత్మక చిత్రాలకు మారు పేరు ఆర్ నారాయణ మూర్తి. ఎన్నో విప్లవాత్మక చిత్రాలలో నటించిన ఆర్ నారాయణ మూర్తి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించారు. లెజెండరీ నటి సావిత్రి జీవిత గాధగా వచ్చిన మహానటి చిత్రం ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంపై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసల జల్లులు కురిపించారు. మహానటి సావిత్రి గురించి నారాయణ మూర్తి అద్భుత విషయాలు వెల్లడించారు.

    తొలిసారి చూసింది అప్పుడే

    తొలిసారి చూసింది అప్పుడే

    దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన గోరింటాకు చిత్ర సమయంలో సావిత్రి గారిని తొలిసారి మద్రాసులో చూశానని నారాయణ మూర్తి అన్నారు. అప్పటికి ఆమె ఆకాశమంత ఎత్తు ఎదిగిన స్టార్. అప్పటికి ఆమెకు బాగా అవకాశాలు తగ్గాయని నారాయణ మూర్తి తెలిపారు.

    చిరు మందహాసం

    చిరు మందహాసం

    ఆ సమయంలో సావిత్రి గారిని దూరం నుంచి చూసే వాడిని. ఎంత మంది ఆమెని కలసినా చిరు మందహాసంతోనే పకరించేది. లేదనకుండా ఉన్నది దానం చేసే దయా గుణం ఆమె సొంతం అని నారాయణ మూర్తి అన్నారు.

    మహానటి చిత్ర యూనిట్‌కు సెల్యూట్

    మహానటి చిత్ర యూనిట్‌కు సెల్యూట్

    సావిత్రిగారి మరణం ప్రపంచ సినిమాకే తీరని లోటు అని నారాయణ మూర్తి అన్నారు. అలాంటి సావిత్రి గారి జీవితాన్ని దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని, నాగ అశ్విన్ కు హ్యాట్సాఫ్ అని నారాయణ మూర్తి ప్రశంసించారు.

    ఆ రెండు లేకపోతే

    ఆ రెండు లేకపోతే

    సావిత్రి గారు జీవితాన్ని అంతా చూసే విధంగా, తెలుసుకునే విధంగా మహానటి చిత్రాన్ని రూపొందించారు. ఏ మనిషికైనా ఆరోగ్యం, ఆర్థిక స్థితి విషయంలో శ్రద్ద ఉండాలని, లేకుంటే జీవితం తలక్రిందులు అవుతుందనే సందేశాన్ని సావిత్రి గారు అందరికి తెలియజేశారని నారాయణ మూర్తి అన్నారు.

    English summary
    R Narayanamurthy praises Mahanati team. Narayanamurthy about Savitri
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X