శ్రీహరి..‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’
విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి...శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రియల్ స్టార్ శ్రీహరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రానికి 'అమ్మకానికి ఆంధ్రప్రదేశ్' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు నటుడు శ్రీహరి చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను పోలీసు కాల్పుల్లో మృతి చెందిన జోగారావు పాత్రను పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ ఉద్యమం ఎంతగొప్పదో సోంపేట ఉద్యమం కూడా అంతే గొప్పదని శ్రీహరి చెప్పుకొచ్చారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే ఈ ప్రాంతం అంతా కాలుష్య కోరల్లో ఇరుక్కుని ఎడారిగా మారుతుందని, ఇక్కడి మత్యకారులు, రైతులు ఉపాది కోల్పోతారని ఆయన అన్నారు. ఈ పరిణామాలన్నీ దర్శకుడు నారాయణ మూర్తి సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











