ఆర్.పి.పట్నాయిక్ కి మంచు మనోజ్ సమస్య
రీసెంట్ గా మిస్టర్ నూకయ్య చిత్రానికి మల్టి నేషనల్ కంపెనీ నోకియా వారి నుంచి సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. నోకియా టైటిల్ ని ఉపయోగిస్తున్నారని వారు కేసు వేయటంతో రిలీజ్ సమయంలో దాన్ని మిస్టర్ నూకయ్య గా మార్చారు. అయితే రిలీజ్ తర్వాత మల్టిప్లెక్స్ లలో దాన్ని ప్రదర్శించకూడదని డిల్లీ హైకోర్టుల నుంచి వారు నోటీసులు ఇప్పించారు. ఈ నేపధ్యంలో ఆర్.పి.పట్నాయిక్ తన చిత్రానికి టైటిల్ సమస్య ఎదురుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన తన చిత్రం టైటిల్ ఫేస్ బుక్ ని ప్రెండ్స్ బుక్ గా మార్చారు. వివరాల్లోకి వెళితే... నిశ్చల్, ఉదయ్, సూర్య తదితరుల కాంబినేషన్‌లో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ళ విజయప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఫ్రెండ్స్‌బుక్'.
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలుత 'ఫేస్‌బుక్' అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు 'ఫ్రెండ్స్‌బుక్'గా మార్చిన విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్పీ మాట్లాడుతూ -''సోషల్ నెట్‌వర్క్‌ని సరైన రీతిలో వినియోగిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? తప్పుదోవ పట్టిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -''ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వాస్తవానికి ఫేస్‌బుక్‌వారి నుంచి మాకెలాంటి అభ్యంతరం ఎదురు కాలేదు. కానీ విడుదల సమయంలో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందేమోననే సందేహంతో 'ఫ్రెండ్స్‌బుక్'గా మార్చాం'' అని చెప్పారు. మొత్తానికి మంచు మనోజ్ సమస్య ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ తమ టైటిల్స్ ని ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చేస్తోంది.


Click it and Unblock the Notifications











