twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆర్.ఆర్.మూవీ మేకర్స్' కాస్టింగ్ కాల్

    By Srikanya
    |

    తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తూ సూపర్ హిట్స్ ని అందిస్తూ దూసుకుపోతున్న సంస్ధ ఆర్.ఆర్.మూవీ మేకర్స్. ఈ సంస్ధ అంతా కొత్త వారితో రీసెంట్ గా 'లవ్‌లాంగ్వేజ్' ('లిపిలేదు' అని ఉపశీర్షిక)అనే చిత్రం ప్రకటించింది. ఈ చిత్రం కోసం టాలెంట్ స్టార్ హంట్ ని నిర్వహిస్తున్నారు. ఎల్. వాసుదేవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ 'లవ్‌లాంగ్వేజ్' రూపొందనుంది. ఈ మేరకు ఆ చిత్ర దర్సకుడు పోస్టర్స్ ని విడుదల చేసారు. ఈ సినిమాను ఈ నెల 15న ప్రారంభించి ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    స్టార్ హంట్ పోస్టర్ లో...

    మీలో ఓ మహేష్ బాబు .... మీలో ఓ అనుష్క ఉన్నారా...

    అయితే మీ పంట పండింది..రిలాక్స్..రిలాక్స్...

    ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్ధ కొత్త వాళ్లతో నిర్మిస్తున్న సినిమాకు 16 నుంచి 25 సంవత్సరాల లోపు యువతీ యువకలుకు నటించే అవకాశం ఇస్తున్నాము.

    Contact email: [email protected]

    నిర్మాత డా॥ వెంకట్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'అంతా కొత్తవారితో సినిమాలు తీయాలన్న నిర్ణయానికి మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అందులో 'లవ్‌లాంగ్వేజ్' సబ్జెక్ట్ మాకు బాగా నచ్చింది. మూడు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఆరు కోట్ల బడ్జెట్‌తో అందరూ కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్తవారితో నిర్మిస్తున్న ఈ చిత్రం సరికొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందని భావిస్తున్నాను' అన్నారు.

    సహ నిర్మాత వి. సురేష్‌డ్డి మాట్లాడుతూ 'సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తిచేస్తాం. కొత్తవారితో మా సంస్థ చేస్తోన్న తొలి చిత్రమిది' అన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా 'లవ్ లాంగ్వేజ్' చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు ఎల్.వాసుదేవా తెలిపాడు.

    English summary
    Venkat of RR Movie Makers is making a new film titled Love Language with all new comers. The producer has already selected a new director Vaasudeva. Those who want to act in the film Love Language.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X