ఆర్ఆర్ మూవీ మేకర్స్ 150 కోట్ల బడ్జెట్ చిత్రం కథ అదే!?
అతి తక్కువ కాలంలోనే తెలుగులో పెద్ద నిర్మాణ సంస్ధగా ఎదిగిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్ధ హాలీవుడ్ లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమయ్యే ఈ చిత్రం కి 'డైవర్స్ ఇన్విటేషన్' అనే పేరు ఖరారు చేసారు. వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణా రెడ్డి డైరక్ట్ చేయనున్నారని వినపడుతోంది. అచ్చిరెడ్డి ఈ ప్రాజెక్టు వెనక ఉన్నారని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం కథ గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆహ్వానం చిత్రం ను పోలి ఉంటుందని చెప్తున్నారు. అందులో రమ్యకృష్ణ విడాకుల కోసం పెళ్ళి తరహాలో బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచి పంక్షన్ చేస్తుంది.
అదే కాన్సెప్టుని ఈ హాలీవుడ్ ప్రాజెక్టుకు అనువర్తింపచేస్తున్నట్లు చెప్తున్నారు. అందుకే ఈ సినిమాకు 'డైవర్స్ ఇన్విటేషన్'అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఇక జొనాథన్ బెన్నెట్, జామిలిన్ సిగ్లర్, నడియా జార్గిన్, ఇలియెట్ గౌల్డ్ ప్రధాన పాత్రలు పోషిస్తారు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి.షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి మిగతా సాంకేతిక వర్గం ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇక ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్ధ గతంలో 'కిక్', 'డాన్‌శీను', 'మిరపకాయ్'లాంటి విజయవంతమైన చిత్రాలను అందించింది.


Click it and Unblock the Notifications











