ఆర్.ఆర్.మూవీ మేకర్స్ 3డి చిత్రం నేడే
బిజనెస్ మ్యాన్, పూల రంగడులతో ఊపు మీదున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ సారి ఓ డబ్బింగ్ చిత్రంతో ముందుకొచ్చారు. మహావీరుడు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఈరోజే విడుదల అయ్యింది. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎడ్వంచర్ 'జాన్ కార్టర్'. ఈ చిత్రం గురించి సహ నిర్మాత వి.సురేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... "మా సంస్థ నుంచి ఓ వైపు తెలుగు చిత్రాలు చేస్తూనే అప్పుడప్పుడూ జనాలు మెచ్చే హాలీవుడ్ చిత్రాలను కూడా అనువదిస్తాం. '2012' కన్నా భారీ వ్యయంతో రూపొందిన చిత్రం 'జాన్ కార్టర్'. డిస్నీ సంస్థ నాలుగున్నరేళ్ళు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.
ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లిషుల్లో విడుదలవుతోంది. 150 థియేటర్లలో టూడీ, త్రీడీల్లో విడుదల చేస్తున్నాం.'' 'కిక్' నుంచి 'కిక్' నుంచి మా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ విజయ పరంపర మొదలైంది. 'బిజినెస్‌మేన్', 'పూలరంగడు'తో హవా కొనసాగుతోంది. 'డమరుకం' చిత్రీకరణ పూర్తై నిర్మాణానంతర పనుల్లో ఉంది. 23న 'లవ్‌లీ' విడుదల కానుంది. నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. పూరి దర్శకత్వంలో 'బిజినెస్‌మేన్-2' కోసం స్క్రిప్టు సిద్ధమైంది. నవంబర్‌లో సెట్స్ మీదకెళ్ళే అవకాశాలున్నాయి. ఇన్ని ప్రాజెక్టులను సక్రమంగా ప్రణాళికాబద్ధంగా నిర్వర్తిస్తున్నామంటే కారణం వెంకట్‌గారి అమూల్యమైన సలహాలు, సూచనలే.'' అన్నారు.


Click it and Unblock the Notifications











