ఊహించని ట్విస్టులతో థ్రిల్లర్‌గా ఆర్ యూ మ్యారీడ్!
అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ యూ మ్యారీడ్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. జయసూర్య ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ సీడీని విడుదల చేశారు. సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో వౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకటరాజ్, అవంతిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అనంతరం మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- మంచి కథాంశంతో ఆర్ యూ మ్యారీడ్ తెరకెక్కింది. అళహరి దర్శకుడిగా, అటు నిర్మాతగా రెండు బాధ్యతల్ని సమన్వయం చేశారు. జయసూర్య అందించిన పాటలు బాగున్నాయి. టీజర్ కూడా ఆకట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కు మంచి లాభాలు తేవాలని ఆకాంక్షించారు.

దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ అనూహ్యమైన రీతిలో ఊహించని ట్విస్టులతో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. నన్ను, నా కథను నమ్మి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమంలో శాంతిరెడ్డి, శ్రీప్రియ, మేకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











