Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చావుబ్రతుకుల్లో నేషనల్ అవార్డ్ విన్నర్( రా.వన్)
రా.వన్ చిత్రానికి యూనిమేటర్గా అద్భుతమైన పనితీరు కనబర్చి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న పాతికేళ్ల యువతి చారుఖండాల్ రోడ్డు ప్రమాదానికి గురై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం రాత్రి చారుఖండాల్ తన సోదరి రీతూ, స్నేహితుడు విక్రాంత్ కలిసి జుహు ప్రాంతంలో డిన్నర్‌కు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో చారు ఖండాల్ వెన్నుముఖకు తీవ్రమైన గాయమైంది.
సోదరి రీతూ స్వల్ప గాయాలతో తప్పించుకోగా స్నేహితుడు విక్రాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రా.వన్ హీరో షారుఖ్ ఖాన్ చారు ఖండాల్ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. స్వయంగా వెళ్లి ఆమెను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.