రూ 170కోట్లు వసూల్ చేసిన రా.వన్ కలెక్షన్ల వరద వెనక సీక్రెట్...?!
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం 'రా.వన్". ఈ సినిమా పై తొలుత మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ తాజాగా ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినా ఏమిటో చూపిస్తోంది. అక్టోబర్ 26 దీపావళి రోజున విడుదలైన ఈ సినిమా 14 .7 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీపావళి పండుగ రోజు సాయంత్రం, రాత్రి ప్రదర్శనలలో ఊహించిన దాని కంటే తక్కువ కలెక్షన్లు వచ్చాయని భావిస్తున్నారు. అయితే రెండో రోజు పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్ష్ ప్రకారం ఈ మూవీ రెండోరోజు 25 .10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇది ఒక రోజులో అత్యధిక వసూళ్లు గా ఆయన తెలిపారు. ఇది సల్మాన్ ఖాన్ 'బాడీ గార్డ్" రికార్డ్ ను చెరిపేసింది. అప్పుడు సల్మాన్ చిత్రం తొలిరోజు 21 కోట్లు, రెండో రోజు 17 .5 సుమారుగా వసూలు చేసింది.
తాజా అంచనాల ప్రకారం వారాంతానికి 170కోట్ల వసూళ్లు సాధించింది. భారతీయుల సినిమా చరిత్రలోనే ఇదో రికార్డు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాను మార్కెటింగ్ చేసిన ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ వివరాలను బహిర్గతం చేసింది. ఇన్ని వసూళ్లు రావడానికి మరో కారణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు వేల పైచిలుకు థియేటర్లలో రిలీజైంది. అందులో 3100థియేటర్లు ఇండియాలో ఉండగా, 904ప్రింట్లతో విదేశాల్లో రిలీజైంది. షారుఖ్ పాపులారిటీకి తోడు సినిమా విజువల్ అద్బుతం కావడంతో సినిమా చూడటానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదన్న మాట ఈ కలెక్షన్ల వెనక ఉన్న రహస్యం...


Click it and Unblock the Notifications











