రజనీ సినిమాలో షారుక్ 2 గంటల అతిథి పాత్ర!
అతిథి పాత్ర అంటే ఐదు లేదా పది నిమిషాలు, మహా అంటే పావుగంట ఉంటుంది. కానీ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ఏకంగా 2 గంటలు అథి పాత్ర చేశాడు. 2 గంటలు నటిస్తే దాన్ని అతిథి పాత్ర అని ఎందుకంటారనే కాదా మీ డౌట్. మీరు ఎన్ని డౌట్లన్నా పడండి...మేం దాన్ని అతిథి పాత్రే అంటాం అంటున్నారు రజనీ అభిమానులు.
షారుఖ్ హీరోగా ఇటీవల విడుదలైన రా.వన్ సినిమాలో రజనీ అతిపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో రజనీ కాంత్ ను కేవలం ఒక నిమిషం పాత్రకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు....అది షారుఖ్ సినిమా కాదు, రజనీ సినిమాలోనే షారుఖ్ అతిథి పాత్ర చేశాడని వాదిస్తున్నారు. ఏది ఏమైతేనేం...రజనీని చూడటానికైనా అభిమానులు సినిమా చూడటానికి బారులు తీరుతున్నారు. దీంతో సినిమా అసలు హీరో షారుఖ్ హ్యాపీగా ఫీలవుతున్నాడు.
రా.వన్ సినిమాలో షారుఖ్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా, అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











