శాటిలైట్ రైట్సే 40 కోట్లు...ఇంక కలెక్షన్స్ ఎంతస్తాయో
షారూక్ తాజా చిత్రం 'రా.వన్' శాటిలైట్ రైట్స్ స్టార్ టీవీ దక్కించుకుంది. దీనికోసం 40 కోట్ల రూపాయలు చెల్లించిందని సమాచారం. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో షారూక్‌ఖాన్, కరీనాకపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షారూక్ తన స్వంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై అనుభవ్ సిన్హా దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం ఆడియో రైట్స్ 12-15 కోట్ల రూపాయలు పలుకవచ్చని వినపడుతోంది.
ఇక ఇన్‌ఫిల్మ్ బ్రాండింగ్ పేరిట మరో పది పదిహేను కోట్లు రాబట్టనున్నారు. అంతేగాక విసిడి, హోం థియేటర్, ఇంటర్నెట్ వంటి మార్గాలలో మరో ఐదారు కోట్ల రూపాయలు 'రా.వన్'కు రావచ్చని తెలుస్తోంది. ఇదంతా లెక్కేస్తే...సినిమా విడుదలకు ముందే 50 కోట్లకు పైగా వసూల్లు నమోదు చేసుకుంటోంది. ఇంత సేఫ్‌గా ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి బిజెనెస్ జరగలేని చెప్తున్నారు. గతంలో అమీర్‌ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' శాటిలైట్ రైట్స్ 36 కోట్ల రూపాయలకు అమ్ముడవటమే రికార్డు.


Click it and Unblock the Notifications











