twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "రాబ్తా"ని మగధీర కాపీ అనకండి బాబూ..! మా పరువు పోతోంది

    బాలీవుడ్ లో వచ్చిన రాబ్తా ట్రైలర్ చూడగానే దాదాపు అందరికీ అర్థమైపోయింది అది మగధీర కాన్సెప్ట్ అని.

    |

    బాలీవుడ్ లో వచ్చిన రాబ్తా ట్రైలర్ చూడగానే దాదాపు అందరికీ అర్థమైపోయింది అది మగధీర కాన్సెప్ట్ అని. వెంటనే మగధీర సినిమాను కాపీ చేస్తున్నారంటూ రాబ్తా సినిమాపై నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత దీనిపై రాబ్తా నిర్మాతలు స్పందించారు. కొంత వివాదం తర్వాత రాబ్తా కాపీ కాదనీ విడుదల చేసుకొమ్మంది కోర్టు, దీన్ని మొదటి విజయం అంటూ తెచ్చి జనం మీదకి వదిలారు అయితే అంత గొప్ప సినిమా అని చెప్పిన రాబ్తా ఇప్పుడు నేలకతుక్కుపోయింది... బాక్సాఫీస్ వెలవెల బోతోంది .

    కష్టాన్ని కాపీ అంటూ అగౌరవ పరుస్తున్నారు

    కష్టాన్ని కాపీ అంటూ అగౌరవ పరుస్తున్నారు

    కేవలం 2 నిముషాల ట్రైలర్‌ను పట్టుకుని సినిమాను కాపీ అంటారా..? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి డైరెక్టర్-ప్రొడ్యూసర్ దినేశ్ విజన్, నిర్మాత భూషణ్ కుమార్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మగధీరకు రాబ్తా కాపీ అనడాన్ని తాము ఖండిస్తున్నట్టు చెప్పారు. తమ కష్టాన్ని కాపీ అంటూ అగౌరవ పరుస్తున్నారని అన్నారు.

    అల్లు అరవింద్

    అల్లు అరవింద్

    కేవలం 2.14 నిముషాల ట్రైలర్‌ను చూసి కాపీ అనే మాటలు వాడడం సబబు కాదని అన్నారు. వాళ్ళన్నట్టే సినిమా చూసిన కోర్ట్ రెండిటికీ సంబందం లేదనీ.., రాబ్తా విడుదల చేసుకోవచ్చహనీ చెప్పేసింది. దాంతో అల్లు అరవింద్ కాస్త వెనక్కి తగ్గాడు. రాబ్తా బయటికి వచ్చింది.

    వేగంగా కథని మార్చేసారు

    వేగంగా కథని మార్చేసారు

    మాదోక అద్బుతమైన సినిమా అన్న రేంజ్ లో వచ్చి మగధీర కాపీ అనగానే పైకి కాదంటూ వెనక వేగంగా కథని మార్చేసారు, ఎన్ని చేసినా ఏం లాభం రాబ్తా అట్టర్ ఫ్లాపయ్యిందక్కడ. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ పునర్జన్మ కథని విమర్షకులు మామూలుగా చీల్చి చెండాడటం లేదు.

    ఈ ఏడాది అతి చెత్త చిత్రం

    ఈ ఏడాది అతి చెత్త చిత్రం

    బాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన అతి చెత్త చిత్రం ఇదేనంటూ ఎవరికి వారు దీనిని తూట్లు పొడిచేస్తున్నారు. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ నటన బాగానే ఉంది అని కొందరు అన్నా కూడా విమర్శలనుంచి తప్పించుకోలేక పోయాడు., కీర్తి సనన్‌తో పాటు దర్శకుడు దినేష్‌ని కూడా తిట్టి పోస్తున్నారు.

    కాపీరైట్స్‌ సమస్య5

    కాపీరైట్స్‌ సమస్య5

    మగధీర కాన్సెప్ట్‌ని తీసుకుని ఈ చిత్ర రచయితలు సరికొత్త సెటప్‌తో రాబ్తాని తీర్చిదిద్దారు. కాపీరైట్స్‌ సమస్య వస్తుందని మగధీరతో పోలిక రాకుండా కథనం, మరికొన్ని సీన్లూ అప్పటికప్పుడు మార్చేసారు. దాంతో సినిమా మొత్తం అతుకుల బొంత లాగా తయారయ్యింది.

    తరుణ్ ఆదర్శ్

    తరుణ్ ఆదర్శ్

    ఆఖరికి అన్ని సినిమాలకూ మంచి సపోర్ట్ ఇచ్చే ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెబుతూ సినిమా దారుణం, నటీనటులు మరీ నాసిరకం అని తేల్చి పారేసాడు. ఒకదానికి ఒకటి లింకు లేని సీన్లతో ఈ సినిమా ప్రేక్షకులకి నరకం చూపిస్తోంది.

    మగధీరతో పోలిస్తే దానికే అవమానం

    మగధీరతో పోలిస్తే దానికే అవమానం

    ఈ చిత్రాన్ని మగధీరతో పోలిస్తే దానికే అవమానమని నార్త్‌ ఆడియన్సే అంటున్నారు. మగధీర చిత్రం అనువాద వెర్షన్‌ని నార్త్‌లో బాగానే చూసారు. 'బాహుబలి' దర్శకుడి సినిమా అనే క్రేజ్‌ 'మగధీర'ని అక్కడ మరింత పాపులర్‌ చేసింది. చాలా చాలా నాసిరకం స్క్రీన్ ప్లే తో విసిగించాడు దర్శకుడు.

    కృతి సనన్ ఐరన్ లెగ్

    కృతి సనన్ ఐరన్ లెగ్

    ధోని సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్ ఇందులో తనకే అర్థం కాని చిత్రవిచిత్రమైన యాక్షన్ తో పల్టీలు కొట్టించాడు. ఇక హీరొయిన్ కృతి సనన్ తన ఐరన్ లెగ్ పేరుని సార్థకం చేసుకుంది. సుబ్బరంగా 'మగధీర'ని మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి ఒరిజినల్‌ నిర్మాతలకి నష్ట పరిహారం చెల్లించుకోవాల్సిందని, ఇలాంటి చెత్త సినిమా తీసి జనం నెత్తిన రుద్దడం దేనికని ఈ సినిమా హీరోని ట్యాగ్‌ చేసి మరీ తిడుతున్నారు.

    అతని రాత మార్చేసింది

    అతని రాత మార్చేసింది

    ధోనీ బయోపిక్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సుషాంత్‌ 'రాబ్తా'తో స్టార్‌గా సెటిల్‌ అయిపోవచ్చునని అనుకున్నాడు కానీ రాబ్తా అతని రాత మార్చేసింది పాపం. రిలీజ్ కి ముందు రోజు "దయచేసి మా సినిమా చూడండీ అంటూ పెట్టిన ట్వీట్ చూసి వెళ్ళిన వాళ్ళు కూడా మొహమాటం లేకుండా తిట్టుకునే రేంజ్ ఫ్లాప్ రావటం సుషాంత్ కి ఒక మైనస్సే అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

    English summary
    Raabta is a huge disaster as collections fell on Saturday from that very poor start.The film is going to join that mega disaster
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X