twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుత కుతలాడుతున్న "రాబ్తా" టీమ్: ''మగధీర'' పై ఇంకా బొంకుతున్నారు...

    ఇదిలావుంటే 'రాబ్తా' కథ ఒరిజినల్‌ అని, ఇది ఏ చిత్రానికి కాపీ కాదని రాబ్తా హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ నొక్కి వక్కాణించాడు.

    |

    రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత జన్మ కథాంశంతో అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ లో వస్తున్న రాబ్తా మాత్రం దాదాపుగా మగధీర పోలికలతోనే ఉంది.

    "మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టారు

    అసలు ట్రైలర్ చూసినప్పుడై తే మగధీర ని మళ్ళీ రీమేక్ చేస్తున్నారా అనిపించేటంత దగ్గర గా ఉంది. దాంతో ఇక మొదలయ్యింది దుమారం. "మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టేసారని 'రాబ్తా' ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ చిత్రాన్ని కాపీ కొట్టారు కనుక పరిహారం చెల్లించేవరకు విడుదల కానివ్వరాదని అల్లు అరవింద్‌ రాబ్తా నిర్మాతలపై కేస్‌ ఫైల్‌ చేసారు.

    రమేష్ బాల

    రమేష్ బాల

    ఇదే విషయాన్ని సినిమా విశ్లేషకుడు రమేష్ బాల ట్విటర్ ద్వారా బయట పెట్తాడు. సినిమా హక్కులను కొనుగోలు చేయకుండానే ఫ్రీమేక్ అంటూ తీసేస్తున్నారని, తద్వారా కాపీరైట్స్‌ను ఉల్లంఘించారని మగధీర నిర్మాతలు పేర్కొన్నట్టు రమేశ్ బాల వివరించారు. కాబట్టి రాబ్తా సినిమా విడుదలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలు కోర్టును కోరినట్టు చెప్పేసాడు.

    రాబ్తా నిర్మాతలకు నోటీసులు

    రాబ్తా నిర్మాతలకు నోటీసులు

    వారి వాదనలు విన్న హైదరాబాద్ కోర్టు రాబ్తా నిర్మాతలకు నోటీసులు ఇచ్చిందని, జూన్ 1కి తదుపరి విచారణను వాయిదా వేసిందని,. ఈ కోర్టు కేసుతో జూన్ 9న రాబ్తా సినిమా విడుదలవుతుందో లేదోనని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దినేశ్ విజన్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న రాబ్తా సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.

    మగధీర సినిమాను పోలి ఉంది

    మగధీర సినిమాను పోలి ఉంది

    సినిమా ట్రైలర్ విడుదలకు ముందు నుంచీ మగధీర సినిమాను పోలి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మగధీర నిర్మాతలు కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది. కోర్టు త్వరలోనే దీనిపై విచారణ జరపనుంది. కోర్టు నిర్ణ్యాన్ని బట్టే సినిమా విడుదల ఉంటుంది అన్నది వినిపిస్తున్నటాక్. అంటే కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా సినిమా రిలీజ్ ఆగిపోయినట్టే అన్నమాట.

    'రాబ్తా' కథ ఒరిజినల్‌

    'రాబ్తా' కథ ఒరిజినల్‌

    అయితే ఇవన్నీ జరుగుతూండగానే రాబ్తా టీమ్ కూడా తమని తాము సమర్థించుకునే పనిలో పడింది.. ఇదిలావుంటే 'రాబ్తా' కథ ఒరిజినల్‌ అని, ఇది ఏ చిత్రానికి కాపీ కాదని రాబ్తా హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ నొక్కి వక్కాణించాడు. ట్రెయిలర్‌ చూసి సినిమా కథ ఏమిటో ఎలా ఊహిస్తారని, కొన్ని పోలికలు కనిపించినంత మాత్రాన కాపీ అయిపోతుందా అని అడుగుతున్నాడు.

    ఒక చిత్రమైన కాన్సెప్ట్‌

    ఒక చిత్రమైన కాన్సెప్ట్‌

    రాబ్తా ఇంతవరకు ఇండియన్‌ స్క్రీన్‌పై రాని ఒక చిత్రమైన కాన్సెప్ట్‌, బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిందని, కోర్టులో ఆ కేసు కొట్టి పారేస్తారని, రాబ్తా విడుదలకి ఎలాంటి ఆటంకం వుండదని అతను అన్నాడు. జూన్‌ 9న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని 'ధోని' ఫేమ్‌ సుషాంత్‌ చెప్పాడు.

    రాబ్తా టీమ్ ఒక ట్రయల్ వేసింది

    రాబ్తా టీమ్ ఒక ట్రయల్ వేసింది

    నిజానికి మగధీర వచ్చాక దాన్ని ఏదో ఒక రకంగా రీమేక్ చేయాలనీ, అలాంటి కథనే రాసి సినిమా చెయ్యాలనీ చాలా ప్రయత్నాలే జరిగాయి కానీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు రాబ్తా టీమ్ ఒక ట్రయల్ వేసింది. అయితే సినిమా వేరుగా ఉన్నా మెయిన్ థీమ్ మాత్రం ఖచ్చితంగా మగధీర అనేది అర్థమయ్యింది... దీన్ని ఇన్స్పిరేషన్ అని సమర్థించుకుంటారో, లేక కాపీ అని ఒప్పేసుకుంటారో చూడాలి.

    English summary
    Makers and Hero of Raabta have rubbished plagiarism allegation, and said that Rabta an original film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X