Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇది మన ‘మగధీర’కు కాపీలా ఉందే...? (ట్రైలర్)
సుషాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్ ‘రబ్తా’ ట్రైలర్ తాజాగా రిలీజైంది.
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత జన్మ కథాంశంతో అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు.
తాజాగా బాలీవుడ్లో మరోసారి 'మగధీర' లాంటి సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. సుషాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్ 'రబ్తా' ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మగధీర సినిమాకు కాపీలా ఉందని అంటున్నారు.
రబ్ తా ట్రైలర్
తాజాగా రిలీజైన బర్త్ తా ట్రైలర్ ఇదే. ఇది చూసిన తర్వాత.... మీకు ఎలాంటి అభిప్రాయం కలిగిందో కామెంట్ బాక్సులో వెల్లడించండి.
రొమాంటిక్ సీన్లు
ఇక సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు జోరుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత హాటుగా, ఘాటుగా క్రితి సనన్ గతంలో ఎప్పుడూ, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయలేదు.
దర్శకుడి గురించి
రబ్ తా చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ చిత్ర దర్శకుడు ‘కాక్ టెయిల్' లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. బద్లాపూర్, హ్యాపీ ఎండింగ్, ఫైండింగ్ ఫన్నీ, గో గోవా గాన్, ఏజెంట్ వినోద్, లవ్ ఆజ్ కల్, హైజాక్, బీయింగ్ సైరస్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
రిలీజ్ డేట్
జూన్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల ముందే.... మగధీరకు కాపీ అంటూ ప్రచారం జరుగడం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.