twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ ఎదురుదెబ్బ.. మగధీరపై గెలిచిన రాబ్దా.. కేసు వాపస్

    తమ చిత్రాన్ని కాపీ కొట్టి రాబ్దాను రూపొందించారనే ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిన మగధీర చిత్ర నిర్వాహకులకు ఎదురుదెబ్బ తగిలింది. రాబ్దా చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ మగధీర నిర్మాత అల్లు అరవింద్ కోర్

    By Rajababu
    |

    తమ చిత్రాన్ని కాపీ కొట్టి రాబ్దాను రూపొందించారనే ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిన మగధీర చిత్ర నిర్వాహకులకు ఎదురుదెబ్బ తగిలింది. రాబ్దా చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ మగధీర నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కీర్తి సనన్ నటించిన రాబ్దా చిత్రం 9వ తేదీ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు 24 గంటల ముందు పిటిషన్ వాపసు తీసుకోవడంతో రాబ్తాకు రిలీజ్‌కు మార్గం సుగమమైంది.

    మగధీరతో సంబంధం లేదు..

    మగధీరతో సంబంధం లేదు..

    2000 సంవత్సరంలో నిర్మించిన మగధీర చిత్ర కథను తమ అనుమతి లేకుండా తస్కరించారని రాబ్తా నిర్మాతకు ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ లీగల్ నోటీసుల పంపించారు. ఆ నేపథ్యంలో తమ చిత్రాన్ని చూసి ఆ తర్వాత స్పందించాలని అల్లు అరవింద్‌ను రాబ్దా నిర్మాతలు కోరిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు విచారణ సందర్భంగా రెండు చిత్రాల కథలు వేర్వేరు. కథలో సారూప్యం లేదు అని రాబ్దా నిర్మాతలు రుజువు చేయడంలో సఫలమయ్యారు.

    కేసు వాపసు తీసుకొన్న అల్లు అరవింద్

    కేసు వాపసు తీసుకొన్న అల్లు అరవింద్

    రాబ్దా కథ మా సినిమా కథే అని చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో మగధీర నిర్మాత అల్లు అరవింద్ గురువారం పిటిషన్ వాపసు తీసుకొన్నారు. దాంతో కథా చౌర్యం కేసుకు తెరపడింది. రాబ్దా సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

    కథను కాపీ కొట్టలేదు..

    కథను కాపీ కొట్టలేదు..

    రాబ్దా సినిమాకు మగధీర కథకు ఎలాంటి పోలికలు లేవు అనే విషయాన్ని సవవిరంగా కోర్టుకు సాక్ష్యాలు సమర్పించాం. మగధీర యుద్ద సన్నివేశాలను కాపీ కొట్టామని చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలకు సమర్పించాం. దాంతో మగధీర చిత్ర నిర్మాతలు తమ కేసును ఉపసంహరించుకొన్నారు అని రాబ్దా చిత్ర దర్శకుడు దినేష్ విజన్ మీడియాకువ వెల్లడించారు.

    యుద్ధ సన్నివేశాలతో సంబంధం లేదు..

    యుద్ధ సన్నివేశాలతో సంబంధం లేదు..

    రాబ్దా కథ, విలన్ క్యారెక్టర్, విదేశీ లోకేషన్లు, చిత్ర క్లైమాక్స్, తదితర విషయాలకు మగధీర సినిమాకు ఎలాంటి సంబంధం లేదు కోర్టుకు వెల్లడించాం. మగధీర సినిమాలోని యుద్ధ సన్నివేశాలను కాపీ కొట్టలేదు అని స్పష్టంగా కోర్టుకు తెలియజేశాం అని దర్శకుడు దినేష్ విజన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

    English summary
    Going down to a last minute verdict, less than 24 hours before the release, the court has finally thrown out the case that was preventing the release of Sushant Singh Rajput and Kriti Sanon's Raabta. Earlier, the makers of 2000 Telegu romantic drama Magadheera had claimed that the theme of 'reincarnation' in Raabta has been lifted from their film!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X