Love Today ఎవరైనా మగాడైతే.. నాకు ఒక్కరే లవరని చెప్పండి.. అనిల్ రావిపూడికి రాధిక శరత్ కుమార్ పంచ్

తమిళనాడులో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకొన్న చిత్రం లవ్ టుడే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్, మ్యూజిక్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ..

మైండ్‌ బ్యాక్ గ్రౌండ్‌లో ఆ పాట

మైండ్‌ బ్యాక్ గ్రౌండ్‌లో ఆ పాట


లవ్ టుడే తెలుగు సినిమా ట్రైలర్, మ్యూజిక్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హీరో యువన్ శంకర్ రాజా. ఈ సినిమాలోని పాటలు నన్ను వెంటాడుతున్నాయి. నేను ఉదయం మెడిటేషన్ చేస్తుంటాను. కానీ నా మైండ్‌ బ్యాక్ గ్రౌండ్‌లో ఒక పాట వెంటాడుతుంటుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఒరిజినల్ హీరో ప్రదీప్ రంగనాథ్. ఆయన కథ చెప్పినప్పుడే ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాను అని రాధిక శరత్ కుమార్ చెప్పారు.

 పవన్ కల్యాణ్‌ను అభిమానించినట్టుగానే

పవన్ కల్యాణ్‌ను అభిమానించినట్టుగానే


లవ్ టుడే సినిమాను ప్రేక్షకులను లవ్ టుడే ఆకట్టుకొంటుంది. ఈ సినిమాను వారు ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.పవన్ కల్యాణ్, మహేష్ బాబును మీరు ఎలా అభిమానిస్తారో.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రదీప్ రంగనాథ్‌ను కూడా అదే విధంగా అభిమానిస్తారు. దిల్ రాజుకు నిజంగానే దిల్ ఉంటుంది. ఈ సినిమా దిల్ రాజు తీసుకొన్నారని తెలియగానే... ఈ మూవీ కరెక్ట్ వ్యక్తి చేతిలో పడిందని చెప్పాం అని రాధికా శరత్ కుమార్ అన్నారు.

థియేటర్లలో పడిపడి నవ్వుతారు..

థియేటర్లలో పడిపడి నవ్వుతారు..


నేను చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేశాను. చాలా మంది హీరోలు, డైరెక్టర్లతో పనిచేస్తున్నాను. కానీ లవ్ టుడే సినిమాను చూసిన తర్వాత భాగ్యరాజ్ రూపొందించిన ఓ సినిమా నాకు గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత థియేటర్లలో కిందపడి పొట్టపట్టుకొని నవ్వుతున్న చిత్రం ఇదే. ఈ సినిమా చూసిన తర్వాత ఒకరి ఫోన్ మరొకరికి ఇవ్వాలంటే.. భయపడుతారు. లైఫ్ పూర్తిగా మారిపోయి ఉంటుంది అని రాధిక శరత్ కుమార్ పేర్కొన్నా

అమ్మాయికి ఇద్దరు ముగ్గురు లవర్లు

అమ్మాయికి ఇద్దరు ముగ్గురు లవర్లు


పాత కాలంలో ఒకరిపైనే ప్రేమ ఉండేది. నాకు ఒకరే లవర్ ఉన్నారని చెప్పుకొనే వారు. అలాగే శోభన్ బాబు సినిమాల్లో ఇద్దరు భార్యలు ఉన్నా .. అతడినే హృదయపూర్వకంగా ప్రేమించే వారు. భర్తనే పూజించే వారు. భర్త కోసమే ఇద్దరు చనిపోవడానికి సిద్దంగా ఉండేవారు. కానీ లవ్ టుడే ప్రదీప్ పాత్ర, క్యారెక్టర్ అద్బుతంగా ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్ విషయానికి వస్తే.. కాఫీ తగడానికి ఒక లవర్, డ్రైవ్‌కు వెళ్లడానికి మరో లవర్ ఉంటుంది. ప్రస్తుతం జనరేషన్‌లో కనిపించే లవ్ ఇదే అని రాధిక శరత్ కుమార్ తెలిపారు.

ఎవరైనా మగాడైతే.. నాకు ఒకరే లవర్

ఎవరైనా మగాడైతే.. నాకు ఒకరే లవర్


ప్రస్తుత జనరేషన్‌లో ఎవరైనా మగాడైతే.. నాకు ఒకరే లవర్ అని నిజంగా చెప్పండి.. నాకు ఒక అమ్మాయితోనే జీవితం అని చెప్పండి అని రాధిక శరత్ అంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి చేయ్యెత్తి నాకు ఒకరే అంటూ సమాధానం చెప్పాడు. అయితే నేను నమ్మను.. నీకు ఇరువైపుల ఇద్దరు అని రాధిక శరత్ కుమార్ పంచ్ విసిరింది. ఇలాంటి పరిస్థితులు కాలంతో పాటు మారుతూ వస్తుంది. లవ్ టుడే సినిమా కింగ్ ఆఫ్ కంటెంట్ అని రాధిక శరత్ కుమార్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X