»   » రోమాలు నిక్కబొడిచే కథాంశం: పార్లమెంటులో రిలీజైన తొలి ట్రైలర్ ఇదే!

రోమాలు నిక్కబొడిచే కథాంశం: పార్లమెంటులో రిలీజైన తొలి ట్రైలర్ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. పార్లమెంటులో రిలీజ్ అయిందంటే ఆ సినిమా ఎలాంటిదో? ఏం ప్రత్యేకత ఉందో అనే ఆసక్తి అందరిలో నూ ఉండటం సహజం. ఆ సినిమా పేరు 'రాగ్ దేశ్'.

ఎప్పుడూ రాజ‌కీయాల‌తో ద‌ద్ద‌రిల్లే పార్ల‌మెంట్ భ‌వ‌న్ తొలిసారి ఓ సినిమా ట్రైల‌ర్ విడుద‌లతో అక్కడ సరికొత్త వాతావరణం ఆవిష్కరించబడింది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో రాగ్‌ దేష్ సినిమా తెరకెక్కింది.

తిగ్మాంషు ధులియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రియల్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో రూపొందించారు. దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రేమ్ సెహ‌గ‌ల్, షా న‌వాజ్ ఖాన్, గుర్బ‌క్ష్ ధిల్లాన్ ఏం చేశారు అనేది సినిమాలో చూపించబోతున్నారు.

రాగ్ దేష్ చిత్రంలో కునాల్ క‌పూర్, అమిత్ సౌధ్‌, మోహిత్ మ‌ర్వాలు కీల‌క పాత్ర‌లు పోషించారు. జూలై 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ రొమాలు నిక్కబొడిలా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

English summary
In a unique launch, the trailer of the film 'Raag Desh', based on the 1945 Red Fort trials of three INA officers, was launched at the Parliament House. Raag Desh is a movie based on true story of the famous Red Fort Trial of the three INA Officers that changed the course of India's Freedom Movement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu