»   » సన్నీలియోన్ రేటు 5 నిమిషాలకు 15 లక్షలు!

సన్నీలియోన్ రేటు 5 నిమిషాలకు 15 లక్షలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి ప్రవేశించి 'జిస్మ్-2' చిత్రంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్....ఇపుడు బాలీవుడ్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. నటన విషయంలో అమ్మడులో విషయం లేక పోయినా....ఆమె అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు అభిమానులు.

ప్రస్తుతం సన్నీ లియోన్ రాగిణి ఎంఎంఎస్-2 చిత్రంలో నటిస్తోంది. పెద్దలకు మాత్రమే చూడదగ్గ శృంగార సన్నివేశాలతో రూపొందుతున్న ఈచిత్రంలో తన భర్త డేనియల్‍‌తో కలిసి నటిస్తోంది సన్నీ. ఈ చిత్రంలో వీరిద్దరు 5 నిమిషాల నిడివిగల హాట్ సీన్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఐదు నిమిషాల సీన్ కోసం రూ. 15 లక్షలు డిమాండ్ చేసిందని, సన్నీ లియోన్ అడిగింది అంత పెద్ద మొత్తం ఏమీ కాకపోవడంతో నిర్మాతలు సంతోషంగా అడిగిన మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఈ సీన్లో సన్నీ లియోన్ రొమాన్స్ ఏ రేంజిలో ఉంటాయో చూడాలి.

రాగిణి ఎంఎంఎస్-2 చిత్రం విషయానికొస్తే....థ్రిల్లర్ హారర్ రొమాన్స్‌తో కూడిన 3డి చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. భూషన్ పటేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. 2011లో వచ్చిన హారర్ మూవీ 'రాగిణి ఎంఎంఎస్' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Porn star turned B-Town actress Sunny leone demanded producers of Raagini MMS-2, a 15 lakh remuneration for just a 5 minute play. She is going to romance with her husband in the movie and for the scene to be shot she demanded the price.
Please Wait while comments are loading...