twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి సినిమాని చంపేసారు, ఘోరమైన రివ్యూలు రాసారు: పాపం లక్ష్మీరాయ్ ఆవేదన

    |

    Recommended Video

    పాపం..లక్ష్మీరాయ్ ఆవేదన చుడండి !

    దక్షిణాదిలో అంతో ఇంతో పేరు తెచ్చుకున్నా టాప్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది పేరు తెచ్చుకొన్న లక్ష్మీరాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. జూలీ2 చిత్రంలో తన అందానికి మెరుగుపెట్టుకొని హాట్‌హాట్‌గా నటించింది. అనేక వివాదాలు, సంచలన వార్తల మధ్య నలిగిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజైంది. విడుదలకు ముందు వచ్చిన మంచి స్పందన భిన్నంగా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తాపడింది. బాలీవుడ్‌లో పాగా వేయాలనుకొన్న రాయ్ లక్ష్మీ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. ఆ విషయం లో బాగానే హర్ట్ అయినట్టుంది ఇంకా ఆ సినిమా గురించే కలవరిస్తోంది... లేటెస్ట్ ఇంటర్వ్యూలో లక్ష్మీ రాయ్ చెప్పిన సంగతులు...

     ఓకే చెప్పలేకపోయాను

    ఓకే చెప్పలేకపోయాను

    దక్షిణాదిన నా సినిమాలు చూసి నాకు "జూలీ 2"లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు కొత్త ఫేస్‌ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు అనుకున్నారట! అవకాశం రాగానే సంతోషం అనిపించినా, వెంటనే ఓకే చెప్పలేకపోయాను. దాదాపు నెల రోజులపాటు ఆలోచించాను. ఈ సినిమా కోసం మునుపెన్నడూ పడనంత కష్టం పడ్డాను.

    స్వేచ్ఛ తప్ప వివాదాలు ఉండవు

    స్వేచ్ఛ తప్ప వివాదాలు ఉండవు

    కచ్చితంగా దక్షిణాది పరిశ్రమే బాగుంది. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుందే తప్ప వివాదాలు ఉండవు. బెదిరింపులు ఉండవు. ఏ సినిమాని అయినా ధైర్యంగా చేయవచ్చు. ‘పద్మావతి' సినిమానే తీసుకుంటే...ఆ సినిమా ఇక్కడ తీస్తే ఇంత వివాదం ఉండదని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా చేసినందుకు దీపికను ఎంత హింస పెడుతున్నారో చూస్తుంటే కోపం వస్తుంది.

    ఆ స్థితిలో నేనుంటేనా?

    ఆ స్థితిలో నేనుంటేనా?

    కానీ, సినిమాలో ఏం చూపించారో తెలియకుండా స్పందించడం బాగుండదని అనుకున్నాను. నేను కానీ, దీపికా కానీ పాత్రలో నటిస్తామే తప్ప వాటితో మాకెలాంటి సంబంధం ఉండదు కదా! ఆ మాత్రం ఆలోచించకుండా ఆమె తల మీద వెల కడితే ఏం అనాలి? దీపిక ధైర్యవంతురాలు కనుక తట్టుకుంటోంది. ఆ స్థితిలో నేనుంటేనా? అనుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. అని చెప్పింది లక్ష్మీరాయ్...

    బాలీవుడ్‌పై దృష్టి

    బాలీవుడ్‌పై దృష్టి

    పాపం ఇంత ప్రేమ ఉన్నా ద‌క్షిణాదిన ఆశించినంత గుర్తింపు మాత్రం రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది రాయ్ ల‌క్ష్మి. `జూలీ-2` వంటి ఎరోటిక్ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుని సెక్స్ బాంబ్‌గా బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుదామ‌నుకుంది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ఆ సినిమా రాయ్ ల‌క్ష్మి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

    మీడియాపై నిప్పులు

    మీడియాపై నిప్పులు

    విమ‌ర్శ‌కులు దారుణంగా రేటింగ్‌లు ఇవ్వ‌డంతో ప్రేక్ష‌కులెవ‌రూ ఆ సినిమాను, రాయ్ ల‌క్ష్మిని కనీస స్థాయిలో కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో రాయ్‌ల‌క్ష్మి మీడియాపై నిప్పులు చెరిగింది. `మా సినిమాను మీడియా అతి దారుణంగా చంపేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు ఘోర‌మైన రివ్వూలు రాసి తొక్కేసింది.

    రాయ్‌ల‌క్ష్మి ఆవేద‌న

    రాయ్‌ల‌క్ష్మి ఆవేద‌న

    సినీ ప‌రిశ్ర‌మ‌లోని చీక‌టి కోణాన్ని చూపించినందువ‌ల్లే ఈ ప‌రిస్థితి ఎదురైంది. మా సినిమా నిర్మాత కూడా ప‌బ్లిసిటీ మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. వ్యూహాత్మకంగా ప్ర‌చారం నిర్వ‌హించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌`ని రాయ్‌ల‌క్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

    English summary
    Julie 2, starring Raai Laxmi, has been in the news for some time now and is in theatres but Turns a Disaster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X